iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ లో ఏ హీరోకి సాధ్యం కాని.. ఆ రికార్డు చంద్రమోహన్ సొంతం!

చంద్రమోహన్ మృతితో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, అగ్ర హీరోలు, తారలు చంద్రమోహన్ మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

చంద్రమోహన్ మృతితో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, అగ్ర హీరోలు, తారలు చంద్రమోహన్ మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

టాలీవుడ్ లో ఏ హీరోకి సాధ్యం కాని.. ఆ రికార్డు చంద్రమోహన్ సొంతం!

చంద్రమోహన్ ఇక లేరనే వార్తను తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా, విలక్షణ నటుడిగా, ఉత్తమ సహాయనటుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. ఎన్నో గొప్ప గొప్ప పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కొన్ని దశాబ్దాల పాటు ఉత్తమ నటుడిగా టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకున్నారు. అలాంటి ఒక ధృవ తార ఈరోజు నేలకొరిగింది. తెలుగు చిత్రపరిశ్రమలో ఒక గొప్ప నటుడు ఇకలేరు. కళామ్మ తల్లి ముద్దుబిడ్డ తుదిశ్వాస విడిచారు. అయితే చంద్రమోహన్ పేరిట ఏ హీరో సాధించని ఓ అద్భుతమైన రికార్డు ఉంది. ఆ రికార్డును మరే హీరో సాధించలేరు అనే చెప్పాలి.

1966లో రంగులరాట్నం చిత్రంతో చంద్రమోహన్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. నేను ఈ పాత్ర అయితేనే చేస్తాను మనస్తత్వం చంద్రమోహన్ ది కాదు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ ని ఎప్పుడూ వదులుకోలేదు. అందుకే సపోర్టింగ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, హాస్యనటుడు ఇలా అన్ని రకాల పాత్రలతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. అయితే చంద్రమోహన్ సాధించిన ఆ ఘనత ఏంటంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి అలనాటి స్టార్ హీరోల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి తర్వాతి తరం హీరోల వరకు అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈతరం హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రవితేజ, గోపీచంద్, మంచు విష్ణు, మంచు మనోజ్ తో కూడా నటించారు. ఈ మూడు తరాల అగ్ర హీరోల్లో దాదాపు అందరితో చంద్రమోహన్ సినిమాలు చేశారు. నిజానికి ఇలాంటి ఒక ఘనతను మరే హీరో కూడా సొంతం చేసుకోలేరేమో.

ఇంక అవార్డుల విషయంలో కూడా చంద్రమోహన్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. నంది పురస్కారం అందుకోవడానికి ముందే.. పదహారేళ్ల సినిమాకి గాను ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ పురస్కారాన్ని అందుకున్నారు. సిరిసిరి మువ్వ సినిమాకి కూడా చంద్రమోహన్ కు ఫిలింఫేర్ అవార్డు దక్కింది. అంతేకాకుండా 1987లో వచ్చిన చందమామరావే సినిమాకి ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం, 2005లో వచ్చిన అతనొక్కడే సినిమాకి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. తన కెరీర్ లో చంద్రమోహన్ కు మొత్తం 6 నంది అవార్డులు దక్కాయి. చివరిసారిగా చంద్రమోహన్.. గోపిచంద్ తో కలిసి ఆక్సిజన్ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత వెండితెరకు చంద్రమోహన్ దూరమయ్యారు. ఆ తర్వాత అడపాదడపా ఇంటర్వ్యూలలో కనిపించేవారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. నంవంబర్ 11న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ మృతిపట్ల తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు చంద్రమోహన్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి