iDreamPost
android-app
ios-app

కొంటెచూపుతో కుర్రకారును ఇబ్బంది పెట్టేస్తున్న దీప్తి సునైనా..

  • Published Mar 26, 2024 | 9:42 PM Updated Updated Mar 26, 2024 | 9:42 PM

Deepthi Sunaina: బిగ్ బాస్ ఫేమ్ దీప్తీ సునైనాకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈమెకు ఏకంగా 40 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.

Deepthi Sunaina: బిగ్ బాస్ ఫేమ్ దీప్తీ సునైనాకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈమెకు ఏకంగా 40 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.

  • Published Mar 26, 2024 | 9:42 PMUpdated Mar 26, 2024 | 9:42 PM
కొంటెచూపుతో కుర్రకారును ఇబ్బంది పెట్టేస్తున్న దీప్తి సునైనా..

బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఫాలో అయ్యేవారికి ఈ అమ్మడు బాగా సుపరిచితురాలు. ముఖ్యంగా కవర్ సాంగ్స్, ఆల్బమ్స్ తో కుర్రకారును తెగ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ముఖ్యంగా లవ్ సాంగ్స్ తో కుర్రాళ్ల చిట్టి హృదయాలకు గిలిగింతలు పెడుతూ ఉంటుంది. ఈ భామ తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోలకు ఒక క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు మాత్రమే కాదు.. ఆ క్యాప్షన్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరి.. క్యాప్షన్ ఏంటి? అసలు అందులో అంత మర్మం ఏం ఉంది?

దీప్తీ సునైనాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సాధారణంగా ఎవరైనా సెలబ్రిటీలు అయ్యాక ట్రోలింగ్ కి గురవుతారు. కానీ, దీప్తీ సునైనా మాత్రం ట్రోలింగ్ తోనే సెలబ్రిటీగా ఎదిగింది. ఆమెను చాలామంది తెగ ట్రోల్ చేసేవాళ్లు. అలాంటి ట్రోల్స్ ని తట్టుకుని తాను చేయాలి అనుకున్నది చేసేది దీప్తీ సునైనా. షార్ట్ వీడియోలు, డాన్స్ వీడియోలతో చిన్నపాటి సెలబ్రిటీగా ఎదిగింది. ఆ తర్వాత యూట్యూబ్ సాంగ్స్, బిగ్ బాస్ తో దీప్తీ సునైనా తన కెరీర్ ని పరుగులు పెట్టించింది. దీప్తీ సునైనా బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత నెటిజన్స్ మాత్రమే కాకుండా.. బుల్లితెర ప్రేక్షకులు కూడా దీప్తీ సునైనాని అభిమానించడం ప్రారంభించారు. ఆ తర్వాత సినిమాల్లో కూడా మెరిసింది. కానీ, ఎప్పుడూ తనకి లైఫ్ ఇచ్చిన యూట్యూబ్ వీడియోలను మాత్రం వదల్లేదు.

 

View this post on Instagram

 

A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina)

ఇప్పటికే ఈ అమ్మడు చేసే కవర్ సాంగ్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. ఈమెకు ఒక్క ఇన్ స్టాగ్రామ్ లోనే 42 లక్షల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. ఇంక తన ప్రాజెక్ట్స్ గురించి మాత్రమే కాకుండా.. తన వ్యక్తిగత జీవితం, ఫొటోషూట్స్ కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. దానికి క్యాప్షన్ గా “నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా” అని పెట్టింది. అయితే అలా ఎందుకు పెట్టింది అని బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఏదో ఒక సాంగ్ లిరిక్ ని పోస్ట్ చేసినట్లు ఉంది. ఇంక చీరలో ఉన్న ఆ పిక్స్ చూసి కుర్రాళ్లు తమ హృదయాలకు గిలిగింతలు పెట్టేస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. చీరకట్టులో సోయగాలు పోతున్న దీప్తి సునైనా ఫోజులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom