iDreamPost
android-app
ios-app

David Warner: వీడియో: పుష్ప స్టైల్ లో డేవిడ్ వార్నర్ యాడ్..! బన్నీ రియాక్షన్ వైరల్!

  • Published Jun 11, 2024 | 4:59 PM Updated Updated Jun 11, 2024 | 4:59 PM

David Warner: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ పాడుతూ.. వీడియోలు చేశాడు. దీంతో వార్నర్ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా పుష్ప వార్నర్ ఓ హిందీ యాడ్ చేశాడు.

David Warner: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ పాడుతూ.. వీడియోలు చేశాడు. దీంతో వార్నర్ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా పుష్ప వార్నర్ ఓ హిందీ యాడ్ చేశాడు.

  • Published Jun 11, 2024 | 4:59 PMUpdated Jun 11, 2024 | 4:59 PM
David Warner: వీడియో: పుష్ప స్టైల్ లో డేవిడ్ వార్నర్ యాడ్..! బన్నీ రియాక్షన్ వైరల్!

ఐకాన్ స్టార్  అల్లు అర్జున్,  లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ పుష్ప.  2021లో విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాపీస్ వద్ద అనేక రికార్డులను తిరగరాసింది. ఇక ఈ చిత్రంలోని డైలాగ్స్, సాంగ్స్ ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. అంతేకాక ప్రపంచ వ్యాప్తంగా ఉండే పలువురు సెలబ్రిటీలు సైతం.. పుష్ప సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ ను ఇమిటేట్ ను చేస్తున్నారు. ఇప్పటికే కోహ్లి, డేవిడ్ వార్నర్, బ్రావో, గేల్ వంటి వారు పుప్ప సాంగ్స్ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డేవిడ్ వార్నర్ పుష్ప స్టైల్ లో  హిందీలో ఓ యాడ్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ కాగా… బన్నీ అదిరిపోయే రిప్లయ్ ఇచ్చారు.

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందుకు కారణం.. అతడు ఐపీఎల్ లో  కొన్నేళ్లుగా హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇలా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరపున ఆడుతూ రెండు తెలుగు రాష్ట్రాల వారికి బాగా దగ్గరయ్యాడు. తనదైన బ్యాటింగ్ స్టైల్ లో క్రికెట్ ప్రియులను అలరించే వాడు. డేవిండ్ వార్నర్ కరోనా టైమ్ లో టాలీవుడ్ హీరోల డైలాగ్స్, పాటలకు రీల్స్ చేసి.. అలరించాడు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీల్లోని పాట‌ల‌కు, డైలాగ్స్‌కు ఎక్కువ‌గా రీల్స్ చేశాడు. అంతేకాక తనదైన డ్యాన్స్ తో తెలుగు వారిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పుష్ప సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ పాడుతూ.. వీడియోలు చేశాడు. దీంతో వార్నర్ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా వార్నర్ ఓ కమర్షియల్ యాడ్ లో నటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. వేక్‌ఫిట్ మ్యాట్రెస్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ను వార్నర్ చేశాడు. ఇక ఆ యాడ్ లో డేవిడ్ వార్నర్ పుష్ప సినిమాలోని బన్నీ క్యారెక్టర్ అయినా పుష్ప రాజ్ పాత్ర‌ను పోషించాడు.  అంతేకాక హిందీలో డైలాగ్‌లు చెప్పాడు. పుష్స స్టైల్ లో ఎడ‌మ చేత్తో త‌గ్గేదేలే ఫోజ్ సైతం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్నర్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో బిజీగా ఉన్నాడు. తన కెరీర్ లో ఇదే చివరి ప్రపంచకప్ అని వార్నర్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.  అలానే బన్నీ కూడా పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వీరిద్దరి సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet