iDreamPost
android-app
ios-app

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అభిరామ్-ప్రత్యూష.. వైరలవుతున్న మ్యారేజ్ ఫొటోలు!

  • Published Dec 07, 2023 | 3:25 PM Updated Updated Dec 07, 2023 | 3:25 PM

టాలీవుడ్ నిర్మాత ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. తాజాగా ఘనంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి వేడుక జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో అభిరామ్- ప్రత్యూష మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

టాలీవుడ్ నిర్మాత ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. తాజాగా ఘనంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి వేడుక జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో అభిరామ్- ప్రత్యూష మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

  • Published Dec 07, 2023 | 3:25 PMUpdated Dec 07, 2023 | 3:25 PM
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అభిరామ్-ప్రత్యూష.. వైరలవుతున్న మ్యారేజ్ ఫొటోలు!

టాలీవుడ్ హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పి మ్యారేజ్ లైఫ్ కి వెల్ కమ్ చెప్తున్నారు. ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని వివాహమాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో హీరో ఓ ఇంటివాడయ్యారు. అతడు ఎవరో కాదు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్. ఇటీవల తన పెళ్లి గురించి జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా అభిరామ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వరుసకు మరదలైన ప్రత్యూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరి మ్యారేజ్ కు సంబంధించిన పెళ్లి ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

యంగ్ హీరో దగ్గుబాటి అభిరామ్- ప్రత్యూష మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. శ్రీలంకలో జరిగిన వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో ప్రత్యూష మెడలో మూడు ముళ్లు వేశారు అభిరామ్. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ మూడు రోజుల పాటు జరిగింది. ఇక వీరి మ్యారేజ్ ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. దీంతో దగ్గుబాటి ఫ్యాన్స్, సినీ ప్రముఖులు అభిరామ్- ప్రత్యూష దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నిర్మాత సురేష్ బాబుకు ఇద్దురు కుమారులన్న విషయం తెలిసిందే. సురేష్ నిర్మాతగా పలు సినిమాలు నిర్మిస్తున్నారు. పెద్ద కొడుకు రానా ఇప్పటికే స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఇక అభిరామ్ కూడా బాబాయి వెంకటేష్, అన్న రానాల బాటలోనే పయనిస్తున్నారు. ఇటీవల ఆయన డైరెక్టర్ తేజ తెరకెక్కించిన అహింస సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యారు. కానీ ఆ మూవీ ఆశించినంతగా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. నటించిన మొదటి సినిమానే షాక్ ఇవ్వడంతో కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. మరి పెళ్లి తర్వాత అభిరామ్ తన సినిమా ప్రాజెక్టులపై అప్ డేట్ ఇస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి అభిరామ్ పెళ్ళిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by South Celebrity (@southcelebrity.insta)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabet