iDreamPost
android-app
ios-app

Jr NTR: దావూదీ సాంగ్.. అంత బాధను భరిస్తూ.. తారక్ డ్యాన్స్ చేశాడా? రత్నవేలు ట్వీట్ వైరల్!

  • Published Sep 05, 2024 | 8:48 AM Updated Updated Sep 05, 2024 | 8:48 AM

Daavudi Song, Jr NTR: దావూదీ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ పాటకు తారక్ వేసిన స్టైలిష్ స్టెప్స్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే గాయంతో బాధపడుతున్నప్పటికీ.. తారక్ వేసిన స్టెప్పులు సూపర్ అంటూ మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Daavudi Song, Jr NTR: దావూదీ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ పాటకు తారక్ వేసిన స్టైలిష్ స్టెప్స్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే గాయంతో బాధపడుతున్నప్పటికీ.. తారక్ వేసిన స్టెప్పులు సూపర్ అంటూ మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

  • Published Sep 05, 2024 | 8:48 AMUpdated Sep 05, 2024 | 8:48 AM
Jr NTR: దావూదీ సాంగ్.. అంత బాధను భరిస్తూ.. తారక్ డ్యాన్స్ చేశాడా? రత్నవేలు ట్వీట్ వైరల్!

దావూదీ.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఈ పాటే వినిపిస్తోంది. ‘దేవర’ నుంచి థర్డ్ సింగిల్ గా దావూదీ సాంగ్ సెప్టెంబర్ 4 సాయంత్రం రిలీజ్ చేశారు. సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. ఇక ఈ పాటకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఈ రేంజ్ లో డ్యాన్స్ వేసిన తారక్.. షూటింగ్ సమయంలో ఎంత బాధను అనుభవించాడో చెప్పుకొచ్చాడు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

‘దేవర’ నుంచి రిలీజ్ అయిన మూడో పాట దావూదీ.. దావూదీ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ లో ఇలా రిలీజ్ చేశారో లేదో.. మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ పాటకు ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు అభిమానులను అలరిస్తున్నాయి. జాన్వీ కపూర్ అందాలు మరోసారి ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. అయితే ఈ పాట చిత్రీకరణ సమయంలో గాయం బాధిస్తున్నా.. దాన్ని తట్టుకుని మరి తారక్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా ట్వీట్ చేశాడు.

“దావూదీ లాంటి ఫాస్ట్ బీట్ సాంగ్ కు తారక్ ఇంత ఈజీగా స్టైలిష్ స్టెప్పులు వేశాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే? ఈ సాంగ్ షూటింగ్ సమయంలో తారక్ కండరాల నొప్పి, గాయంతో బాధపడుతున్నాడు. అంతటి బాధను భరిస్తూ కూడా ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేయడం నిజంగా గ్రేట్. తారక్ నీకు హ్యట్సాఫ్” అంటూ రత్నవేలు ట్విట్టర్ వేదిగకా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో.. ఇంత బాధను అనుభవిస్తూ.. అంత అద్భుతంగా ఎలా డ్యాన్స్ చేశావ్ తారక్ అన్న అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామజోగయ్య శాస్త్రి అందించిన అద్భుతమైన లిరిక్స్ కు శేఖర్ మాస్టర్ అంతే అద్భుతంగా కొరియోగ్రఫీ చేశాడు. నకాశ్ అజిజ్, అకసా తమ గొంతుతో పాటకు మరింత అందం తెచ్చారు. ఈ పాట ఇప్పటికే 10 మిలియన్లకు పైగా వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş