iDreamPost
android-app
ios-app

సలార్ నుంచి స్పెషల్ అప్డేట్! కానీ.., ఫ్యాన్స్ హ్యాపీగా లేరు!

  • Published Nov 13, 2023 | 4:03 PM Updated Updated Nov 13, 2023 | 4:03 PM

సలార్ సినిమా రిలీజ్ దగ్గర్లోకి వచ్చేస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు అన్నీ ఈ మూవీపైనే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక క్రేజీ అప్ డేట్ వచ్చేసింది.

సలార్ సినిమా రిలీజ్ దగ్గర్లోకి వచ్చేస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు అన్నీ ఈ మూవీపైనే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక క్రేజీ అప్ డేట్ వచ్చేసింది.

  • Published Nov 13, 2023 | 4:03 PMUpdated Nov 13, 2023 | 4:03 PM
సలార్ నుంచి స్పెషల్ అప్డేట్! కానీ.., ఫ్యాన్స్ హ్యాపీగా లేరు!

సలార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఉండదని చెబుతున్నారు. అనుకున్న రోజునే డిసెంబర్ 22న సలార్ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అవుతుందంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ మూవీ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అయితే ఆ వార్త విన్న తర్వాత ప్రభాస్ అభిమానులకు ఆనంద పడాలో.. బాధ పడాలో అర్థం కావట్లేదు.

సలార్ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఇటీవల డార్లింగ్ నుంచి వచ్చిన సినిమాలు నిరాశ పరిచిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు అందరూ ప్రశాంత్ నీల్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. అభిమానుల అంచనాలకు తగినట్లుగా ప్రశాంత్ నీల్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్, బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబో సలార్ అనగానే అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా రెండు పార్ట్స్ లో రాబోతోంది. పైగా కేజీఎఫ్ కి ఈ చిత్రానికి లింక్స్ కూడా ఉంటాయి అంటున్నారు. తాజాగా వచ్చిన అప్ డేట్ ఏంటంటే.. సలార్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతోంది అని ప్రచారం సాగుతోంది. ఈ విషయం విన్న తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ లో ఊపొచ్చింది. ఎందుకంటే అసలు సాంగ్స్ ఉండవన్న మూవీలో స్పెషల్ సాంగ్ అనగానే అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.

ఆ సాంగ్ లో ప్రబాస్ ఉండడు అనే విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు. ఐటమ్ సాంగ్ ఉందని ఆనందించాలో.. ప్రభాస్ ఆ సాంగ్ లో ఉండడని బాధపడాలో వారికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న చిత్రంలో సాంగ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? అయితే ముందు ఈ మూవీలో సాంగ్ అనుకోలేదంట.. కానీ, తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోడీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని టాక్ నడుస్తోంది. ఈ సాంగ్ విషయంలో లేటుగా తీసుకున్న నిర్ణయం కాబట్టే ఈ సాంగ్ లో ప్రభాస్ లేడు అనే కంక్లూజన్ కి వచ్చేస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా మారిపోయారు. ఇటీవలే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అలాగే టీజర్ డిసెంబర్ 1న రాత్రి 7.19 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇంక ఫ్యాన్స్ కూడా ఇప్పటి నుంచే సంబరాలు చేసుకోవడం షురూ చేశారు. మరి.. సలార్ లో ఐటమ్ సాంగ్ ఉండటం, అందులో ప్రభాస్ ఉండడు అని చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş