iDreamPost
android-app
ios-app

SSMB29 నుంచి క్రేజీ న్యూస్.. స్వయంగా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి! ఫ్యాన్స్ కు పండగే..

  • Published Mar 19, 2024 | 8:11 AM Updated Updated Mar 19, 2024 | 8:11 AM

SSMB29 చిత్రానికి సంబంధించి ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్ ఇచ్చాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో ప్రదర్శితం అవుతున్న సందర్భంగా అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న జక్కన్న అభిమానులకు అదిరిపోయే న్యూస్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

SSMB29 చిత్రానికి సంబంధించి ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్ ఇచ్చాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో ప్రదర్శితం అవుతున్న సందర్భంగా అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న జక్కన్న అభిమానులకు అదిరిపోయే న్యూస్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Mar 19, 2024 | 8:11 AMUpdated Mar 19, 2024 | 8:11 AM
SSMB29 నుంచి క్రేజీ న్యూస్.. స్వయంగా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి! ఫ్యాన్స్ కు పండగే..

ఎస్ఎస్ రాజమౌళి.. ప్రస్తుతం ఈ పేరు తెలియని ప్రపంచ సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన సినిమాలతో ప్రేక్షకులను ప్రభావితం చేయడమే కాకుండా.. అభిమానులుగా మార్చుకున్నాడు. ప్రపంచ సినీ అభిమానులు దైవంగా కొలిచే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ నే తన మేకింగ్ తో ఫిదా చేశాడు జక్కన్న. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో హాలీవుడ్ ను అతలాకుతలం చేసి.. ఆస్కార్ ను ఇండియాకు పట్టుకొచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్రం జపాన్ లో స్క్రీనింగ్ అవుతోంది. ఈ సందర్భంగా జక్కన్నకు స్పెషల్ గా ఆహ్వానం అందింది. అక్కడికి వెళ్లిన రాజమౌళి.. మహేష్ బాబుతో చేస్తున్న ఫిల్మ్ పై స్వయంగా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.

SSMB29.. టాలీవుడ్ తో పాటుగా ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ ఇది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోందన్న వార్తలు ఇప్పటికే వైరల్ గా మారాయి. జంగిల్ అడ్వెంచరల్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ను స్వయంగా రాజమౌళి ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో స్క్రీనింగ్ అవుతోంది. ఈ సందర్భంగా అక్కడి నుంచి జక్కన్నకు ప్రత్యేక ఆహ్వానం రావడంతో.. తన భార్యతో కలిసి వెళ్లాడు.

ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి SSMB29 మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నాడు. జక్కన్న మాట్లాడుతూ..”నా నెక్ట్స్ చిత్రానికి సంబంధించి రైటింగ్ వర్క్ పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీకి హీరోని కూడా లాక్ చేశాం. అతని పేరు మహేష్ బాబు. అతడు చాలా అందంగా ఉంటాడు. మీక్కూడ తెలుసు. ఈ చిత్రాన్ని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. మూవీ రిలీజ్ అయిన తర్వాత అతడిని ఇక్కడికి తీసుకొస్తాను” అని చెప్పుకొచ్చాడు జక్కన్న. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారడంతో.. ఇటు మహేష్ ఫ్యాన్స్, అటు రాజమౌళి అభిమానులు సంతోషపడుతున్నారు. కథ రాయడం అయిపోందని, ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పడంతో జక్కన్న ఈ చిత్రాన్ని కాస్త ఫాస్ట్ గానే తీస్తాడనే నమ్మకం అభిమానుల్లో కలుగుతోంది. మరి ఈ క్రేజీ న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: జపాన్ లో 83 ఏళ్ల మహిళ సర్ ప్రైజ్.. రాజమౌళి ఎమోషనల్..

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss