iDreamPost
android-app
ios-app

జపాన్ లో 83 ఏళ్ల మహిళ సర్ ప్రైజ్.. రాజమౌళి ఎమోషనల్..

  • Published Mar 18, 2024 | 10:08 PM Updated Updated Mar 18, 2024 | 10:08 PM

SS Rajamouli: ప్రస్తుతం జపాన్ లో ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ అవుతోంది. ఆ షోకి రాజమౌళి దంపతులు హాజరయ్యారు. వారికి అక్కడ ఓ మహిళా అభిమాని ఇచ్చిన సర్ ప్రైజ్ కి రాజమౌళి ఎమోషనల్ అయ్యారు.

SS Rajamouli: ప్రస్తుతం జపాన్ లో ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ అవుతోంది. ఆ షోకి రాజమౌళి దంపతులు హాజరయ్యారు. వారికి అక్కడ ఓ మహిళా అభిమాని ఇచ్చిన సర్ ప్రైజ్ కి రాజమౌళి ఎమోషనల్ అయ్యారు.

  • Published Mar 18, 2024 | 10:08 PMUpdated Mar 18, 2024 | 10:08 PM
జపాన్ లో 83 ఏళ్ల మహిళ సర్ ప్రైజ్.. రాజమౌళి ఎమోషనల్..

ప్రపంచ చలనచిత్రసీమలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమాకి ఒక ప్రత్యేక స్థానం దక్కింది అంటే ఎక్కువ శాతం క్రెడిట్ దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. ప్రపంచం మొత్తం అభిమానించే జేమ్స్ కేమరూన్ లాంటి దిగ్గజ దర్శకులను అభిమానిగా చేసుకున్న ఘనత రాజమౌళికి సాధ్యమైంది. అలాంటి జక్కన్న నుంచి వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా ఘనత ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా స్క్రీనింగ్ అవుతోంది. ఆ షోకి రాజమౌళి దంపతులు హాజరయ్యారు. అక్కడ ఒక ఘటన జక్కన్నను భావోద్వేగానికి లోనయ్యేలా చేసింది.

వయసుతో సంబంధం లేకుండా ఒక వ్యక్తికి అభిమానులను, ఆరాదించే వారిని తెచ్చిపట్టేది సినిమా. ఎంటర్ టైన్మెంట్ విభాగంలో కేవలం ఆలోచన, అవుట్ పుట్ మాత్రమే ఉంటుంది. ఆ అవుట్ పుట్ కు భాష, వయసుతో సంబంధం లేకుండా అభిమానులు ఏర్పడతారు. ఇప్పుడు జక్కన్నకు కూడా వరల్డ్ వైడ్ గా అదే తరహాలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు జపాన్ లో స్క్రీనింగ్ కి హాజరైన రాజమౌళి ఆ విషయం తెలిసొచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తనకు దక్కుతున్న అభిమానం గురించి చెప్పుకొచ్చారు. ఈ అభిమానానికి తనకు మాటలు రావడంలేదంటూ ఎమోషనల్ అయ్యాడు.

రాజమౌళి చేసిన పోస్ట్ ఏంటంటే.. “జపాన్ లో ఓరిగామీ క్రేన్స్ ని తయారు చేస్తారు. వాటిని తమకు కావాల్సిన వారికి, అభిమానించే వారికి బహూకరిస్తారు. వాటి ద్వారా వాళ్లు ఆరోగ్యంగా, ఆందంగా ఉండాలి అని కోరుకుంటారు. ఈ 83 ఏళ్ల మహిళ మాకోసం అలాంటివి 1000 చేసింది. ఎందుకంటే ఆమెకు ఆర్ఆర్ఆర్ సంతోషాన్ని ఇచ్చింది. వాటిని మాకు పంపి ఆమె మాత్రం బయట చలిలోనే ఉండిపోయింది. కొందరి అభిమానానికి వెల కట్టలేం. జస్ట్ గ్రేట్ ఫుల్” అంటూ రాజమౌళి క్యాప్షన్ ఇచ్చాడు. ఆమెను లోపలికి పిలిపించి ఆమెతో ఫొటో కూడా దిగారు. అలాగే రమా రాజమౌళిని కూడా ఆ మహిళ కలిసింది. వారితో ఫొటోలు దిగింది. వారికి తాను తయారు చేసిన ఓరిగామిలను స్వయంగా అందించింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజమౌళికి దక్కిన సర్ ప్రైజ్ పై నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ రేంజ్ ని ప్రపంచవ్యాప్తం చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పనిలోపని మహేశ్- రాజమౌళి కాంబో గురించి ఏదైనా అప్ డేట్ ఇవ్వండి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు. రాజమౌళి ఇటీవల ఓ సందర్భంలో మహేశ్ ప్రాజెక్ట్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ రూ.1000 కోట్ల బడ్జెట్ తో రాబోతోంది అని చెప్తున్నారు. అలాగే వరల్డ్ వైడ్ కాన్సెప్ట్ తో వస్తోందని చెప్తున్నారు. మరి.. రాజమౌళికి జపాన్ మహిళ ఇచ్చిన గిఫ్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique