iDreamPost
android-app
ios-app

Rana Daguubati: రానా- తేజ కాంబో రాక్షస రాజాలో సూపర్ స్టార్?

  • Published Jan 25, 2024 | 7:59 PM Updated Updated Jan 25, 2024 | 7:59 PM

రానా దగ్గుబాటి అభిమానులకు క్రేజీ న్యూస్ అందుతోంది. తేజా కాంబోలో వస్తున్న రాక్షస రాజా నుంచి ఒక వార్త వైరల్ అవుతోంది.

రానా దగ్గుబాటి అభిమానులకు క్రేజీ న్యూస్ అందుతోంది. తేజా కాంబోలో వస్తున్న రాక్షస రాజా నుంచి ఒక వార్త వైరల్ అవుతోంది.

  • Published Jan 25, 2024 | 7:59 PMUpdated Jan 25, 2024 | 7:59 PM
Rana Daguubati: రానా- తేజ కాంబో రాక్షస రాజాలో సూపర్ స్టార్?

టాలీవుడ్ లో ఉన్న విలక్షణ నటుల్లో రానా దగ్గుబాటి కూడా ఒకడు. పాత్ర ఏదైనా తనదైనశైలిలో వెండితెర మీద నిప్పులు చెరుగుతూ ఉంటాడు. బాహుబలి తర్వాత మళ్లీ అంతటి పవర్ ఫుల్ క్యారెక్టర్ తో అయితే రానాని స్క్రీన్ మీద చూడలేదు. ప్రయోగాలు చేయడంలో రానా ముందు వరుసలో ఉంటాడు. కానీ, హిట్టు కొట్టాలి అంటే ప్రయోగాలు మాత్రమే కాదు.. పవర్ ఫుల్ కంటెంట్ కూడా ఉండాల్సిందే. అందుకే రానా తనకు హిట్టు తెచ్చిపెట్టిన డైరెక్టర్ తేజాతోనే సినిమాకి రెడీ అయిన విషయం తెలిసిందే. రానా పుట్టినరోజు సందర్భంగా ‘రాక్షసరాజా’ పేరును కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీ నుంచి ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

రానా దగ్గుబాటి నుంచి సినిమా వస్తోంది అంటే మినిమం ఎక్స్ పెక్టేషన్స్ అయితే ఉంటాయి. అలాంటి రానా తన హిట్టు డైరెక్టర్ తో మరో సినిమా చేయబోతున్నాడు అనగానే ఆ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తేజా కాంబోలో నేనే రాజు నేనే మంత్రి సినిమా తీసిన రానా తన కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్టుని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో రాక్షస రాజా అనే సినిమా రాబోతోంది. డిసెంబర్ నెలలో రానా బర్త్ డే సందర్భంగా పోస్టర్ ని అయితే రిలీజ్ చేశారు. ఒక గ్యాంగ్ స్టర్ లుక్ లో భుజం మీద మెషిన్ గన్ పెట్టుకుని ఊర మాస్ లుక్స్ లో అయితే రానా కనిపించాడు. టైటిల్ కి తగ్గట్లుగా సినిమాలో క్యారెక్టర్ ఉండబోతోందని ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఆ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్స్ రాలేదు.

తాజాగా రాక్షస రాజా మూవీకి సంబంధించి ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లోకి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. ఒక మంచి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో మోహన్ లాల్ కనిపించబోతున్నారట. రాక్షస రాజా స్టోరీ మొత్తం బావాబామ్మర్దుల నేపథ్యంలో సాగే కథగా చెబుతున్నారు. రానాకి బావగా మోహన్ లాల్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. బావ సక్సెస్ కోసం ఏమైనా చేయడానికి వెనుకాడని ఒక ఇన్ టెన్స్ క్యారెక్టర్ లో రానాని చూడబోతున్నారు. బావకి అధికారం కట్టబెట్టి ఆయన కళ్లల్లో సంతోషం చూడాలనేది ఆ బామ్మర్ది కోరిక. మరి.. అది ఎంత వరకు నెరవేరుతుంది? బావకి అధికారం కట్టబెట్టడానికి ఉన్న అడ్డంకులు ఏంటి అనేది బ్యాక్ డ్రాప్ లోనే కథ నడిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

రాక్షస రాజాలో రానా పాత్రకు ఎంత వెయిట్ ఉంటుందో.. బావ పాత్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందనే మోహన్ లాల్ ని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి రానా మూవీ నుంచి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు క్రేజీ వార్తే అందింది. రానా- మోహన్ లాల్ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది అంటూ ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఊహించుకోవడం మొదలు పెట్టారు. రాక్షస రాజా బిగ్ హిట్టుగా నిలవడమే కాకుండా రానా- తేజాకి మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రాక్షస రాజాలో మోహన్ లాల్ నటించబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet