iDreamPost
android-app
ios-app

క్రేజీ కాంబో.. బాలయ్యను డీల్ చేయబోతున్న హరీష్ శంకర్

వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నారు టాలీవుడ్ హీరో బాలయ్య బాబు. ఎన్బీకే 109 చిత్రాన్ని బాబీ కొల్లి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇందులో దుల్కర్, బాబీ డియోల్ వంటి స్టార్స్ నటించనున్నారు. అయితే ఇప్పుడు మరో సినిమాను షురూ చేస్తున్నాడని తెలుస్తోంది.

వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నారు టాలీవుడ్ హీరో బాలయ్య బాబు. ఎన్బీకే 109 చిత్రాన్ని బాబీ కొల్లి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇందులో దుల్కర్, బాబీ డియోల్ వంటి స్టార్స్ నటించనున్నారు. అయితే ఇప్పుడు మరో సినిమాను షురూ చేస్తున్నాడని తెలుస్తోంది.

క్రేజీ కాంబో.. బాలయ్యను డీల్ చేయబోతున్న హరీష్ శంకర్

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ 100 సినిమాలు పూర్తి చేశాక.. జోరు పెంచారు. ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. గత ఏడాది రెండు హిట్స్ అందించాడు బాలయ్య. వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి మూవీస్‌తో మంచి జోష్ మీదున్నారు ఆయన. ఇటు సినిమాలు.. అటు పొలిటికల్.. అలాగే టీవీ హోస్ట్, యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీ లైఫ్ గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌బీకే తన 109 చిత్రాన్ని షురూ చేశారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిిస్తున్నారు. ఇందులో బాలయ్య కుమారుడిగా దుల్కర్ నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతాలా ఫీమేల్ లీడ్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ నెట్టింట్లో చర్చకు దారి తీసింది. కాగా, ఇప్పుడు మరో మూవీని షురూ చేశారట బాలకృష్ణ. ఈసారి కూడా యంగ్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నాడు బాలయ్య బాబు. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్- బాలకృష్ణను డీల్ చేయబోతున్నాడట. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ కూడా పట్టాలు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మిగిలిన వివరాలు త్వరలో ప్రకటించనుంది.

ఇది నిజమేతై.. ఓ క్రేజీ కాంబోలో సినిమా రాబోతుంది. గతంలో అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి రామయ్య వస్తావయ్యా తీసిన హరీష్ శంకర్.. ఇప్పుడు బాబాయ్‌తో ఓ మాస్ మూవీని తీసేందుకు రెడీ అవుతున్నాడట. 2019లో వచ్చిన గద్దల కొండ గణేష్ తర్వాత అతడి నుండి మరో సినిమా రాలేదు. పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన అప్ డేట్ లేదు. ఈ క్రమంలో ఇటీవల రవితేజతో సినిమా ఎనౌన్స్ చేశాడు శంకర్. మిస్టర్ బచ్చన్ రాబోతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్యను డైరెక్ట్ చేయబోతున్నాడు హారీష్ శంకర్. మరీ అఫిషియల్ ఎనౌన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş