iDreamPost
android-app
ios-app

Digangana Suryavanshi: డబ్బులు తీసుకుని మోసం చేసింది… టాలీవుడ్ హీరోయిన్ పై ఫిర్యాదు!

  • Published Jun 10, 2024 | 2:11 PM Updated Updated Jun 10, 2024 | 2:11 PM

సినిమాలు, సీరియల్స్ , వెబ్ సిరీస్ ఇలా ఏవైన కావచ్చు.. వీటిల్లో కొన్ని సార్లు నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల మధ్య వివాదాలు వస్తుంటాయి. మోసం చేశారంటూ కొందరి స్టార్లపై కూడా ఫిర్యాదులు వస్తుంటాయి. తాజాగా డబ్బులు తీసుకుని మోసం చేసిందని ఓ టాలీవుడ్ హీరోయిన్ పై ఫిర్యాదు వచ్చింది.

సినిమాలు, సీరియల్స్ , వెబ్ సిరీస్ ఇలా ఏవైన కావచ్చు.. వీటిల్లో కొన్ని సార్లు నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల మధ్య వివాదాలు వస్తుంటాయి. మోసం చేశారంటూ కొందరి స్టార్లపై కూడా ఫిర్యాదులు వస్తుంటాయి. తాజాగా డబ్బులు తీసుకుని మోసం చేసిందని ఓ టాలీవుడ్ హీరోయిన్ పై ఫిర్యాదు వచ్చింది.

  • Published Jun 10, 2024 | 2:11 PMUpdated Jun 10, 2024 | 2:11 PM
Digangana Suryavanshi: డబ్బులు తీసుకుని మోసం చేసింది… టాలీవుడ్ హీరోయిన్ పై ఫిర్యాదు!

సినీ ఇండస్ట్రీకి చెందిన వార్తలు అనేక వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల ఇంట జరిగే వేడుకలకు సంబంధించిన వార్తలతో పాటు ఇలా పలు వివాదల న్యూస్ లు కూడా వస్తుంటాయి. తరచూ కొందరు నటీనటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల మధ్య వివాదాలు జరుగుతుంటాయి. అవి కాస్తా కోర్టు వరకు వెళ్తుంటాయి. ముఖ్యంగా తమను మోసం చేశారంటూ సినీ రంగానికి చెందిన కొందరు పోలీస్ గడప తొక్కుతుంటారు. ఇలాంటి వివాదల్లో నటీమణులు కూడా ఉంటారు. డబ్బులు తీసుకుని మోసం చేసినందటూ ఓ టాలీవుడ్ హీరోయిన్ పై ఫిర్యాదులు వచ్చాయి. మరి.. ఆ హీరోయిన్ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సినిమాలు, సీరియల్స్ , వెబ్ సిరీస్ ఇలా ఏవైన కావచ్చు.. వీటిల్లో కొన్ని సార్లు నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల మధ్య వివాదాలు వస్తుంటాయి. పేమెంట్స్ విషయం లేదా మరే ఇతర విషయాల్లో కూడా మోసం జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా షో స్టాపర్ అనే వెబ్ సిరీస్  విషయంలో కూడా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సిరీస్ ను ప్రకటించి రెండేళ్లవుతున్నా..నేటికీ విడుదలకు నోచుకోలేదు. ఇటీవలే ఈ సిరీస్ ఆగిపోయిదంటూ  ప్రచారం కూడా జరిగింది. దీనిపై స్పందిస్తూ దర్శక నిర్మాత మనీశ్ హరిశంకర్.. తమ సిరీస్ ఆగిపోయిందంటూ వచ్చే ప్రచారం అబద్ధమనిపేర్కొన్నారు. డబ్బింగ్‌ పనులు పూర్తయ్యాయని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అంతేకాక ఈ సిరీస్ ను త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

 ఇక ఈ సిరీస్ లో జీనత్‌ అమన్‌, జరీనా వాహబ్‌, శ్వేత తివారి, దిగంగన సూర్యవంశీ, సౌరభ్‌ రాజ్‌ జైన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ కోసం  ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో టాలీవుడ్ నటీ, హీరోయిన్‌ దిగంగన సూర్యవంశీపై షో స్టాపర్ సిరీస్ ప్రొడ్యూసర్ మనీశ్‌ హరిశంకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షో స్టాపర్‌ ప్రాజెక్ట్‌ లో భాగమయ్యేలా హీరో అక్షయ్‌ కుమార్‌, ఆయన నిర్మాణ కంపెనీని ఒప్పిస్తానని దిగంగన గొప్పలు చెప్పిందట. తనకు బాలీవుడ్ లో అక్షయ్‌ కుమార్‌, షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి వారు పరిచయాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చిందట. అంతేకాక వారిని ఈ ప్రాజెక్టులో భాగం చేస్తానని నమ్మించిందని మనీశ్ హరిశంకర్ తెలిపారు.

అలా బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ను ఈ సిరీస్ కోసం రప్పిస్తానని చెప్పి తమ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని చివరకు మోసం చేసిందని ఎమ్‌హెచ్‌ ఫిలింస్‌ నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. అంతేకాక తన డిమాండ్లు నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హరిశంకర్ ను బెదిరించినట్లు ఆయన తరపు లాయర్ తెలిపారు. అంతేకాక తమ ప్రాజెక్టు ఆగిపోయిందని, డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు చేసి తమ బ్యానర్‌ గౌరవాన్నిదిగజార్చారంటూ దిగంగన సూర్యవంశీ ఫ్యాషన్‌ డిజైనర్‌ కృష్ణన్‌ పార్మర్‌, నటుడు రాకేశ్‌ బేడీపై నిర్మాత పరువు నష్టం దావా వేశారు. కాగా దిగంగన సూర్యవంశీ టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించారు. తెలుగులో హిప్పీ, వలయం, సిటీమార్‌, క్రేజీఫెలో వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. మొత్తంగా ఈ ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ వ్యహరానికి సంబంధించి పూర్తి విషయాలు తెలియాలంటే..మరికొంత సమయం ఆగాల్సిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş