iDreamPost
android-app
ios-app

ఆ వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో సమంత.. కొత్త చిక్కులు తప్పవా?

  • Published Jul 08, 2023 | 11:08 AM Updated Updated Jul 08, 2023 | 11:08 AM
  • Published Jul 08, 2023 | 11:08 AMUpdated Jul 08, 2023 | 11:08 AM
ఆ వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో సమంత.. కొత్త చిక్కులు తప్పవా?

స్మైలింగ్‌ క్వీన్‌ సమంత సిటడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌ రీమీక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సిటడెల్‌’కు ఇండియన్‌ వర్షన్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌లో వరున్‌ ధావన్‌, సమంత జంటగా నటిస్తున్నారు. రాజ్‌, డీకేలు దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే సమంతకు ఓ కొత్త తల నొప్పి వచ్చిపడేటట్లు ఉంది. ఆ తలనొప్పి కూడా హాలీవుడ్‌ ‘సిటడెల్‌’ రీమేక్‌ రూపంలో సమంతను చుట్టుముట్టనుంది.

అట్టర్‌ ప్లాపుగా ఇంగ్లీష్‌ ‘సిటడెల్‌’.. ఆగ్రహంలో అమెజాన్‌ సీఈవో..

ప్రియాంక నటించిన ‘సిటడెల్‌’ ఇంగ్లీష్‌లో అట్టర్‌ ప్లాపుగా నిలిచింది. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం అమెజాన్‌ సంస్థ ఏకంగా 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపు రూ.2000 కోట్ల రూపాయలు. ఇంత ఖర్చు పెట్టి తీసిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అమెజాన్‌ భారీ నష్టాలను చవిచూసింది. ఈ సిరీస్‌ దెబ్బకు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది. ఈ నేపథ్యంలోనే సంస్థ సీఈవో పెద్ద పెద్ద షోలపై దృష్టి సారించారు. వాటి బడ్జెట్‌పై ఆరాలు తీస్తున్నారు.

సిటడెల్‌ రీమేక్‌.. సమంతకు కొత్త తలనొప్పిగా మారనుందా?

ఇంగ్లీష్‌ సిటడెల్‌ అట్టర్‌ ప్లాప్‌ అయిన విషయం ఈ పాటికే సమంతకు చేరి ఉంటుంది. అసలే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన శాకుంతలం ప్లాపుతో బాధపడుతున్న ఆమెకు.. సిటడెల్‌ రీమెక్‌ కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కథలో ఇండియన్‌ నేటి విటీకి తగ్గట్లుగా ఎన్ని మార్పులు చేసినా.. సోల్‌ మొత్తం అదే ఉంటుంది కాబట్టి.. ఇక్కడ కూడా సిటడెల్‌కు విముఖత వ్యక్తం అయ్యే అవకాశం ఉండకపోలేదు. అదే గనుక జరిగితే.. సమంత ఖాతాలోకి మరో ప్లాపు చేరుకుంటుంది. మానసికంగా.. శారీరకంగా బాగా కృంగిపోయి ఉన్న ఆమె.. వరుస ప్లాపులు గనుక ఎదురైతే ఎలా తట్టుకుంటుందన్నది దేవుడికే తెలియాలి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişkingroyalgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom