iDreamPost
android-app
ios-app

‘గుంటూరు కారం’ మూవీ నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్!

  • Author ajaykrishna Published - 02:07 PM, Sat - 22 July 23
  • Author ajaykrishna Published - 02:07 PM, Sat - 22 July 23
‘గుంటూరు కారం’ మూవీ నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్!

సాధారణంగా షూటింగ్ జరుపుకుంటున్న స్టార్ హీరోల సినిమాల నుండి ముఖ్యమైన టెక్నీషియన్స్ బయటకి వెళ్లిపోవడం అనేది రేర్ గా జరుగుతుంటాయి. సరే ఒకరు కాకపోతే ఇంకొకరిని పెట్టుకొని సినిమా షూటింగ్ ఫినిష్ చేసేయవచ్చు. అది వేరే విషయం. కానీ.. ఒకే సినిమా నుండి అటు మెయిన్ హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజాగా సినిమాటోగ్రాఫర్ కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ మూవీ ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది.

ప్రస్తుతం అటు హీరో, ఇటు డైరెక్టర్ ఇద్దరు సూపర్ హిట్స్ తో ఫామ్ లో ఉండేసరికి.. ఈ మూడో కాంబినేషన్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే గుంటూరు కారం టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా వదిలి సర్ప్రైజ్ చేశారు. సరే.. సినిమా మొత్తానికి సాఫిగా వెళ్తుంది. అనుకుంటున్న టైమ్ లో సినిమా నుండి మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకుందని షాక్ ఇచ్చారు మేకర్స్. దాంతో సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీలను మెయిన్ చేసి.. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ఆల్రెడీ ఆమెతో ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసేశారు. ఆ తర్వాత సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ తప్పుకున్నాడని వార్తలొచ్చాయి.

ఇక సినిమా నుండి ఒక్కొక్కరుగా పోతున్నారని ఫ్యాన్స్ కంగారు పడిపోయారు. అయితే.. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఉన్నాడా లేదా వేరే వాళ్లను తీసుకున్నారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయం తేలకముందే తాజాగా మూవీ నుండి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకున్నట్లు న్యూస్ వచ్చేసింది. ఇంకేముంది.. ఆయన ప్లేస్ లో మరో కెమెరామెన్ రవి కే చంద్రన్ ని తీసుకున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ టీమ్. దీంతో మహేష్ ఫ్యాన్స్ కి మరో షాక్ తగిలినట్లే అయింది. ఇలా ఎందుకు ఒక్కొక్కరుగా మూవీ నుండి తప్పుకుంటున్నారో అర్ధం కాక బుర్రబద్దలు కొట్టేసుకుంటున్నారు. కానీ.. వారి డేట్స్, కమిట్మెంట్స్ వల్ల తప్పుకుంటున్నారని టాక్. మరి గుంటూరు కారం మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Tollywood Updates (@tollywoodtu)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio