iDreamPost
android-app
ios-app

విశ్వంభరకు వింత కష్టం.. త్వరగా తీరేనా?

  • Published Mar 04, 2024 | 3:08 PM Updated Updated Mar 04, 2024 | 3:08 PM

Viswambhara Movie News: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరకు వింత కష్టం వచ్చింది అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాకి కష్టమా? అందేంటో చూడండి..

Viswambhara Movie News: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరకు వింత కష్టం వచ్చింది అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాకి కష్టమా? అందేంటో చూడండి..

  • Published Mar 04, 2024 | 3:08 PMUpdated Mar 04, 2024 | 3:08 PM
విశ్వంభరకు వింత కష్టం.. త్వరగా తీరేనా?

మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభరతో బిజీగా ఉన్నారు. బిబింసార డైరెక్టర్ వశిష్ట మెగా ఫోన్ పట్టుకున్న విషయం తెలిసిందే. చిరు కూడా చాలాకాలం తర్వాత సోషియో ఫాంటసీ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి చాలానే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కథ కూడా ఇలా ఉంటుంది అంటూ చెప్పేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీకి కొత్త కష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి విశ్వంభర ఒక వింత కష్టాన్ని ఫేస్ చేస్తోంది అంటూ టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి.. ఆ కష్టం ఏంటి? అది ఇప్పట్లో తీరేదేనా? చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి- వశిష్ఠ కాంబోలో వస్తున్న విశ్వంభర సినిమాపై చాలాన్ అంచనాలు ఉన్నాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు చిరు సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్లు మరోసారి జతకడుతున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. విశ్వంభర చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల చేయనున్నారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఒక కథ కూడా చెప్తున్నారు.

ప్రచారంలో ఉన్న విశ్వంభర కథ ఏంటంటే.. హిట్లర్ మూవీ తరహాలోనే ఈ చిత్రంలో కూడా చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లు ఉంటారట. ఈ సినిమాలో కూడా రైస్ మిల్ ఓనర్ పాత్రలోనే చిరంజీవి కనిపించబోతున్నారు అంటున్నారు. అలాగే ఈ సినిమాలో 70 ఏళ్ల వృద్ధుడి రూపంలో కూడా చిరంజీవి ప్రయోగం చేయబోతున్నారని చెప్తున్నారు. ఇక్కడ సినిమాకి వచ్చిన వింత కష్టం ఏంటంటే.. సరైన స్టార్ కాస్ట్ దొరకడం లేదట. చిరంజీవి సిస్టర్స్ రోల్ చేసేందుకు కాస్త నేమ్, ఫేమ్ ఉన్న ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నారట. ఇంకా లిస్ట్ ఫైనల్ కాలేదు అంటున్నారు. మెగాస్టార్ మూవీ కాబట్టి మరీ కొత్త వారిని పెట్టలేరు. అలాగని స్టార్స్ ని తీసుకురావాలి అంటే మూవీ బడ్జెట్ పెరిగిపోతుంది. ఈ డైలమాలోనే చిత్ర యూనిట్ ఉందని చెప్తున్నారు.

ఇప్పుడు ఈ ఐదుగురు సిస్టర్స్ రోల్స్ లో ఎవరిని తీసుకోబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు ఈ సిస్టర్స్ క్యారెక్టర్స్ మృణాళ్ ఠాకూర్, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి, సురభి చేస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి వార్తలను నమ్మే పరిస్థితి లేదు. విశ్వంభరకు ఈ కష్టం ఎకువ రోజులు ఉండేది కాదని.. త్వరలోనే ఇది సెట్ అవుతుంది అంటున్నారు. మొత్తానికి మెగా సినిమాకి కూడా కష్టాలు తప్పడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ విశ్వంభర మూవీకి సంబంధించి మెగాస్టార్ మెగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారని చెప్తున్నారు. ఈ చిత్రం కోసం భారీగానే పారితోషకం రూపంలో అందుకోబోతున్నారు అంటూ చెప్తున్నారు. మరి.. విశ్వంభరకు కష్టాలు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş