iDreamPost
android-app
ios-app

చిరంజీవి స్పెషల్ యూఎస్ఏ ట్రిప్

  • Published Feb 14, 2024 | 3:17 PM Updated Updated Feb 14, 2024 | 5:11 PM

Mega Couple Off To USA: మెగాస్టార్ చిరంజీవి- సురేఖా దంపతులు ఒక స్పెషల్ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. అలాగే ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలిపారు.

Mega Couple Off To USA: మెగాస్టార్ చిరంజీవి- సురేఖా దంపతులు ఒక స్పెషల్ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. అలాగే ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలిపారు.

  • Published Feb 14, 2024 | 3:17 PMUpdated Feb 14, 2024 | 5:11 PM
చిరంజీవి స్పెషల్ యూఎస్ఏ ట్రిప్

ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సురేఖ గారితో కలిసి అమెరికాకు విహారయాత్రకు వెళ్లిన విషయాన్ని చిరు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. “నా బెటర్ హాఫ్ సురేఖతో కలిసి చిన్న హాలిడే కోసం యూఎస్ఏ వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చిన వెంటనే విశ్వంభర షూటింగ్ తిరిగి ప్రారంభిస్తాను. త్వరలోనే కలుద్దాం! అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు” అని చిరు ట్వీట్ చేశారు. స్వయంగా మెగాస్టార్ చెప్పినట్టు, తన సతీమణితో కొద్ది రోజుల స్పెషల్ ట్రిప్ తరువాత మళ్ళీ ఆయన షూటింగ్ లో పాల్గొంటారు.

గత ఏడాది కూడా అమెరికా వెళ్లిన చిరు వ్యక్తిగత కార్యక్రమాలకు తగినంత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మధ్య కాలంలో షూటింగులతో బిజీగా ఉన్న ఆయనకు ఇది ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంత కాలంగా చిరంజీవి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. వ్యక్తిగత జీవితంలోని విశేషాలతో పాటు సినిమా అప్డేట్స్ కూడా ఆయన తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తున్నారు. భోళా శంకర్ వంటి పరాజయం తరువాత వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ విశ్వంభర సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇది చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ఖరీదైన చిత్రం అవడం మరో విశేషం. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు. కాగా ఇటీవలే చిరంజీవి ఈ సినిమా షూటింగ్ కి సంభందించి ఒక షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఫాంటసీ జానర్ అంటే ప్రేక్షకుల్లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్నందున విశ్వంభర బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio