iDreamPost
android-app
ios-app

Salaar Movie: ‘సలార్’ టీమ్ పై చిరంజీవి ప్రశంసల జల్లు!

  • Published Dec 23, 2023 | 2:07 PM Updated Updated Dec 23, 2023 | 2:07 PM

బాహుబలి తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్.. కేజీఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ ’ మూవీతో డిసెంబర్ 22 ప్రేమక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది.

బాహుబలి తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్.. కేజీఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ ’ మూవీతో డిసెంబర్ 22 ప్రేమక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది.

  • Published Dec 23, 2023 | 2:07 PMUpdated Dec 23, 2023 | 2:07 PM
Salaar Movie:  ‘సలార్’ టీమ్ పై చిరంజీవి ప్రశంసల జల్లు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సలార్’ . డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కెంచిన ఈ సినిమా ఎన్నో వాయిదాలు పడి ఎట్టకేలకు ప్రేక్షేకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా   డిసెంబర్ 22న దాదాపు 5 భాషాల్లో రీలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో  ఈ సినిమాకి బ్లాక్​బస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్  సంబరపడుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్, టాలీవుడ్ , కోలివుడ్ అనే తేడా లేకుండా అందరూ సలార్ జపం చేస్తున్నారు. ఇక భారీ అంచనాలతో విడుదలైన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూ.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులు సలార్ మూవీని చూసి తమ అభిప్రాయలను తెలియజేశారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది అంటూ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

 సలార్ మూవీ ట్రైలర్, టీజర్, పాటలతో భారీ హైప్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఫ్యాన్స్ అంచనాలను కూడా బ్రేక్ చేశాడు. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. సలార్ మూవీలో ప్రభాస్ కటౌట్ చూస్తూ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతున్నారు. థీయోటర్లలో ఈ మూవీని టాలీవుడ్ యంగ్ హీరోస్ నిఖిల్, శ్రీవిష్ణు చూసి విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం సలార్ మూవీ పై తన సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చారు. ‘మై డియర్ దేవా రెబల్ స్టార్ ప్రభాస్ కు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో మీకు మీరే సాటి. కాగా, వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఆద్యగా శృతి హాసన్, కార్త పాత్రలో జగపతి బాబు చాలా అద్భుతంగా నటించారు. అలాగే హోంబాలే సంస్థకు, చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’ అంటూ ప్రశంసలు కురిపిస్తూ మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఫ

ఇక సలార్ మూవీ విషయానికి వస్తే.. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ కాస్త టైమ్ తీసుకొని ప్రభాస్ తో సలార్ మూవీకి ప్లాన్ చేశారు. అప్పటికే మూడు వరుస డిజాస్టర్స్ తో ఉన్న ప్రభాస్ కి సలార్ కథ నచ్చడంతో మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎంతో ఆలస్యం అయినా..పలు మార్లు వాయిదా పడ్డా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఓ అద్బుతాన్ని అభిమానులకు అందించాలనే తపనతో తెరెక్కించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం సలార్ సీజ్ ఫైర్ అనే టైటిల్ తో   రిలీజ్ చేయగా, ఇక రెండవ భాగానికి ‘సలార్ శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది ఇలా ఉంటే.. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా సంతృప్తి నిచ్చిన సినిమా సలార్. మరి, సలార్ మూవీ పై మెగాస్టార్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş