iDreamPost
android-app
ios-app

భోళా శంకర్ టీజర్ విడుదల.. బాస్ లుక్స్ చూసి పిచ్చెక్కి పోతున్న ఫ్యాన్స్!

భోళా శంకర్ టీజర్ విడుదల.. బాస్ లుక్స్ చూసి పిచ్చెక్కి పోతున్న ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా వస్తోంది అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతికి బాస్ నుంచి వాల్తేరు వీరయ్య రూపంలో బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే ఏడాదిలో ఇంకో ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైపోయాడు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో చిరంజీవి- మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత అది ఇంకాస్త పెరిగింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అప్పీయరెన్స్, ఆ స్వాగ్ చూసి మెగా అభిమానులు పిచ్చెక్కిపోయారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇంక టీజర్ విషయానికి వస్తే.. మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్, ఆ స్వాగ్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. రౌడీ అల్లుడు సినిమాలో ఆటో జానీ పాత్రను గుర్తు చేసేలా డైలాగ్స్ ఉన్నాయి. ఆ సినిమాలో ముంబయిలో ఆటో డ్రైవర్ గా చేస్తే.. ఈ మూవీలో ట్యాక్సీ డ్రైవర్ గా చూపించబోతున్నారు.

ఇంద్ర సినిమా స్టైల్లో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండేలా చూపించారు. ఇంక రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ “స్టేట్ డివైడ్ అయినా అంతా నావాళ్లే.. ఆల్ ఏరియాస్ అప్నా హై. నాకు హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్” చిరంజీవి చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టీజర్ చూసిన తర్వాత ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయనే చెప్పాలి. ఇంక ఈ సినిమాలో తమన్నా, కీర్తీ సురేశ్, శుశాంత్, మురళీ శర్మ, రఘు బాబు, శ్రీముఖి, వెన్నెల కిశోర్, రష్మీ గౌతమ్ వంటి ఎంతో మంది మఖ్యపాత్రల్లో కనిపంచనున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom