iDreamPost
android-app
ios-app

చిరంజీవి కాలికి సర్జరీ? మెగాస్టార్ అమెరికా వెళ్లింది అందుకేనా?

చిరంజీవి కాలికి సర్జరీ? మెగాస్టార్ అమెరికా వెళ్లింది అందుకేనా?

ప్రస్తుతం చిరంజీవి అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల భార్య సురేఖతో కలిసి అమెరికా టూర్ వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ కి ముందు.. అలా ఆటవిడుపు కోసం వెళ్లినట్లు అంతా భావించారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా దాగుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అందేటంటే మెగాస్టార్ చిరంజీవి అమెరికాలో సర్జరీ చేయించుకున్నట్లు చెబుతున్నారు. అవును.. అసలు టూర్ వెళ్లింది కూడా అందుకే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కాలికి సర్జరీ చేయించుకున్నారు అనే వార్త వినగానే మెగా అభిమానుల్లో కాస్త కలవరం మొదలైంది. అయితే చిరంజీవి కూడా భార్యతో కలిసి టూర్ కి వెళ్తున్నట్లుగానే చెప్పారు. సర్జరీ గురించి అయితే ఎక్కడా మాట్లడాలేదు. టూర్ గ్యాప్ లోనే కాలికి సర్జరీ చేయించుకున్నారని చెబుతున్నారు. కాలు కాస్త ఇబ్బంది పెడుతుంటే దాని నుంచి రిలీఫ్ పొందేందుకు సర్జరీ చేయించుకున్నట్లు సినిమా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అయితే అది చాలా మైనర్ సర్జరీగా చెబుతున్నారు. దాని గురించి అసలు భయపడాల్సిన పనేం లేదని సమాచారం. పైగా అమెరికా వెళ్లేటప్పుడు చక్కగా నడుచుకుంటూనే వెళ్లారు. కాబట్టి అభిమానులు నిశ్చింతగా ఉండొచ్చని టాక్ నడుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

అమెరికా నుంచి తిరిగి రాగానే భోళా శంకర్ ప్రచార కార్యక్రమాల్లో మెగాస్టార్ పాల్గొంటారని చెబుతున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్- మెగాస్టార్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తీ సురేశ్, శుశాంత్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, శ్రీముఖి, అనసూయ, రష్మీ వంటి సెలబ్రిటీలు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. తర్వాత చిరంజీవి కుమార్తె సుస్మితా ప్రొడక్షన్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఓ సినిమా చేయనున్నట్లు చెబుతున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచి బ్రో డాడీ మూవీకి ఇది రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తైందంట.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom