iDreamPost
android-app
ios-app

Chiranjeevi: చిరంజీవి షాకింగ్‌ కామెంట్స్‌.. వరుణ్‌పై ఇప్పటికీ కోపంగా ఉన్నా

  • Published Feb 26, 2024 | 12:24 PM Updated Updated Feb 26, 2024 | 12:24 PM

మెగా వారి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే. వారిలో వరుణ్ తేజ్ ఒకరు. తాజాగా వరుణ్ నటించిన సినిమా ఆపరేషన్ వేలంటైన్ అయితే.. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న వరుణ్ కు .. ఆ ఈవెంట్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి నుంచి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.

మెగా వారి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే. వారిలో వరుణ్ తేజ్ ఒకరు. తాజాగా వరుణ్ నటించిన సినిమా ఆపరేషన్ వేలంటైన్ అయితే.. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న వరుణ్ కు .. ఆ ఈవెంట్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి నుంచి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.

  • Published Feb 26, 2024 | 12:24 PMUpdated Feb 26, 2024 | 12:24 PM
Chiranjeevi: చిరంజీవి షాకింగ్‌ కామెంట్స్‌.. వరుణ్‌పై ఇప్పటికీ కోపంగా ఉన్నా

ఇటీవల మెగా కుటుంబలో జరిగిన అతి పెద్ద ఈవెంట్ అంటే .. అది వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహమే. వీరి ప్రేమ వివాహం కుటుంబ సభ్యుల అంగీకారంతో .. అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే, పెళ్ళికి ముందు వరకు కూడా వీరి ప్రేమ గురించి ఎక్కడ ఏ టాక్ వినిపించలేదు. సోషల్ మీడియాలో కాదు కదా కనీసం వారి వారి ఇళ్లలో కూడా ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారట ఇరువురు. సాధారణంగా అన్ని విషయాలు చిరంజీవితో పంచుకుంటాడట వరుణ్. కానీ, తన ప్రేమ విషయాన్నీ చిరుతో చెప్పకపోవడంతో కాస్త నిరాశచెందారట చిరు. తాజాగా వరుణ్ తేజ్ నటించిన “ఆపరేషన్ వాలెంటైన్” సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు విచ్చేసిన సందర్భంలో .. చిరు చెప్పిన మాటలు ఇవి.

ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన సినిమా “ఆపరేషన్ వాలైంటైన్”. ఈ సినిమాను మార్చి 1న థియేటర్ లలో విడుదల చేయనున్నారు మేకర్స్. కాబట్టి ప్రస్తుతం మూవీ టీమ్ అంతా ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా “ఆపరేషన్ వాలెంటైన్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా విచ్చేశారు. అయితే, ఈ సందర్భంలో వరుణ్ తేజ్ పెళ్ళి గురించి చిరంజీవి మాట్లాడుతూ.. “ప్రతిదీ నాకు చెప్తాడు, కానీ ఈ ఒక్కటి చెప్పలేదు. చాలాసార్లు నన్ను ఇన్స్పిరేషన్ అని చెప్తుంటాడు. మరి లీక్స్ విషయంలో కూడా ఇన్స్పైర్ అయ్యి నాకు చెప్పొచ్చు కదా! వాళ్ళ నాన్నకు చెప్పుకోలేని విషయాలు కూడా నాతో చెప్పుకుంటాడు. ఈ ఒక్కటి మాత్రం చెప్పలేదు. ఈ విషయంలో నాకు ఇప్పటికీ కోపంగా ఉంది” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు చిరు.

ఇక ఆ విషయంలో వరుణ్ స్పందిస్తూ.. “పెదనాన్న మీద ఉన్న గౌరవంతో కూడిన భయం వల్లే చెప్పలేదు. కానీ, ఇంట్లో రివీల్ చేసేటపుడు ముందు మా పెదనాన్నకే చెప్పాను” అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక సరదాగా అలా వారిరువురి మధ్య సంభాషణలు సాగాయి. కాగా, “ఆపరేషన్ వాలెంటైన్” చిత్రాన్ని మార్చి 1న తెలుగు, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ , ట్రైలర్ తో ప్రేక్షకులలో ఓ విధమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి, “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి, వరుణ్ తేజ్ ల మధ్యన సాగిన సంభాషణలపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş