iDreamPost
android-app
ios-app

ఫోటోలో పిల్లాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ట్రెండింగ్ హీరో అతను!

  • Author ajaykrishna Updated - 07:26 AM, Wed - 2 August 23
  • Author ajaykrishna Updated - 07:26 AM, Wed - 2 August 23
ఫోటోలో పిల్లాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ట్రెండింగ్ హీరో అతను!

సినీ ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు లేపరు.. ఎవరిని వారే లేపుకోవాలి అనే మాటలు.. మీరు ఇప్పుడు పైన ఫోటోలో చూస్తున్న పిల్లాడికి కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఎందుకంటే.. ఎప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చినా.. కెరీర్ మొత్తం సైడ్ క్యారెక్టర్స్ తోనే ట్రావెల్ అవుతుండటంతో డేర్ చేశాడు. సొంతంగా తనను తాను హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు. కట్ చేస్తే.. కొన్నాళ్ళకు హీరో అనే ట్యాగ్ వచ్చేసింది. హీరో అనిపించుకుంటే సరిపోతుందా హిట్స్ కూడా ఉండాలి. లేకపోతే ఆ ఉన్న ట్యాగ్ పోతుంది.. అందుకే ఓ పెద్ద ప్లాన్ వేసి.. డైరెక్టర్ తో మాట్లాడుకొని డేర్ చేశాడు. ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ హీరోలలో ఎవరు ఆ దారిలో సక్సెస్ కాలేదు.

అంత టాలెంట్ ఉన్నట్లు ఎవరు కనిపించడం లేదు. కానీ.. మీరు చూస్తున్న పిల్లాడు చాలా షార్ప్. ఎలాంటి మ్యాటర్ అయినా ఇట్టే సులువుగా సాల్వ్ చేసేస్తాడులే అని మాటలతో అనిపిస్తాడు. మరి చేస్తాడా లేదా తర్వాత సంగతి. బాగా గమనిస్తే.. ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న హీరోలలో ఒకడు. గతేడాది బ్లాక్ బస్టర్ కొట్టి.. కెరీర్ లో టర్నింగ్ పాయింట్ మూవీ చేశాడు. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ కూడా తీసుకొస్తున్నాడు. ఎవరో గుర్తొచ్చిందా.. అరే చూసినట్లే ఉందిగాని గుర్తు రాట్లేదా.. ఇప్పుడో క్లూ ఇస్తా. ఇతను హీరో అయ్యాక వేరే స్క్రిప్ట్ వర్కౌట్ కాక.. సొంతంగా స్క్రిప్ట్ రాసుకోవడం మొదలు పెట్టాడు.

ఈ హీరో లాస్ట్ హిట్ కూడా అతను రాసుకున్నదే కావడం విశేషం. అంటే ఇప్పుడు సీక్వెల్ కి కూడా రైటర్ అతనేనా? అంటే.. అవును. ఆల్రెడీ ఈపాటికి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఫోటో చూసి గుర్తు రాకపోయినా.. ఇప్పటిదాకా ఇచ్చిన క్లూస్ అయితే చాలా హెల్ప్ అవుతాయి అతను ఎవరో గుర్తించడానికి. మరో విషయం.. ఇతను సినిమాలో చాలా నాటీ. అమ్మాయి కనబడగానే ఫ్లర్ట్ చేసేస్తాడు. ఓ ఓకే.. ఇప్పుడు గుర్తొచ్చింది.. నువ్వు చెప్తోంది డీజే టిల్లు గురించి కదా! అనే ఐడియా వచ్చేసిందా. అవును.. ఆ ఫోటోలో ఉన్న పిల్లాడు టిల్లునే అలియాస్ సిద్ధు జొన్నలగడ్డ. బ్లాక్ బస్టర్ డీజే టిల్లు తర్వాత.. టిల్లు స్క్వేర్ తో రెడీ అయిపోయాడు. కాగా.. ప్రస్తుతం టిల్లు చిన్నప్పటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పిల్లాడి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet