Keerthi
Vennela Kishore: టాలీవుడ్ కామెడీయన్ వెన్నెల కిషోర్ నటించిన తాజా చిత్రం చారి 111. అయితే తాజాగా ఈ సినిమా విడుదలైన పదిహేను రోజులకే ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..
Vennela Kishore: టాలీవుడ్ కామెడీయన్ వెన్నెల కిషోర్ నటించిన తాజా చిత్రం చారి 111. అయితే తాజాగా ఈ సినిమా విడుదలైన పదిహేను రోజులకే ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
ప్రస్తుత కాలంలో వెండితెర పై నవ్వులు పూయించడమే కాదు, హీరోలుగా మెప్పించగలం అంటున్నారు నేటి కమెడియన్లు. ఈ క్రమంలోనే ఎంతోమంది కమెడియన్లు తమ సత్తాను చాటెందుకు హీరోలుగా సినీ పరిశ్రమ పై ఎంట్రీ ఇస్తూ సక్సెస్ ఫుల్ గా నిలుస్తున్నారు. మరి అలాంటి వారిలో వెన్నెల కిషోర్ కూడా ఒకరు. అసలు తెలుగు సినిమాల్లో ఈయన కామెడీ లేని సినిమాంటూ ఈమధ్యకాలంలో లేదు. అంతలా సినిమాల్లో తనదైన కమెడీతో అందరిని అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వెన్నెల కిషోర్. అయితే తాజాగా ఈయన హీరోగా ‘చారి 111’ అనే మూవీతో ప్రేక్షకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఈనెల అనగా మార్చి 1వ తేదీన థియేటర్లలో విడుదలై ఆశించిన విజయం అందుకోలేక పోయింది. దీంతో ఇప్పడు చారి 111 సినిమా థియేటర్లలో విడుదైన 15 రోజులకే ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..
కామెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాజా చిత్రం ‘చారి 111’. ఈ సినిమా ఈనెల అనగా మార్చి 1వ తేదీన థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే స్పై కామెడీ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రానికి టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించగా.. ఇందులో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్‌గా నటించింది. ఇక చారి 111 మూవీని..మిస్టర్ బీన్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ జానీ ఇంగ్లీష్ స్ఫూర్తి తో రూపొందించారు. అయితే.. మొదట ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, టీజర్స్, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇక థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆ స్పై కామెడీ అనేది ప్రేక్షులను మెప్పించడంలో విఫలమైంది.
ఎందుకంటే.. సినిమాలో కామెడీతో ప్రేక్షకులను నవ్చించగలిగారు కానీ, కథను మాత్రం డైరెక్టర్ సరిగ్గా చూపించలేదనే టాక్ వినిపించింది. దీంతో ఈ సినిమా కాస్త వెన్నెల కిషోర్ కు నిరాశ పరిచిందనే చెప్పావచ్చు. అయితే థియేటర్లలో అంతగా అలరించని చారి 111 సినిమా.. విడుదలై 15 రోజులు గడవక ముందే ఓటీటీలో వచ్చేందుకు రెడీగా ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హక్కులనుు సొంతం చేసుకున్నది. దీంతో చారి 111 సినిమా మార్చి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహాలో కూడా రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు మరో వార్త జోరుగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో మురళీశర్మ, సత్య, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషించారు.
ఇక చారి 111 సినిమా విషయానికొస్తే.. రా, ఎన్ఐఏ లకు ధీటుగా రుద్రనేత్ర పేరుతో ముఖ్యమంత్రి (శుభలేఖ సుధాకర్) ఓ స్పెషల్ ఎజెన్సీను ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ రుద్రనేతకు హెడ్ గా ప్రసాద్‌రావు (మురళీశర్మ) వ్యవహరిస్తుంటాడు. కాగా, హైదరామాద్ లోని ఓ మాల్ లో ఓ మాల్‌లో బాంబ్‌బ్లాస్ట్ జరుగుతుంది. కాగా, ఆ సూసైడ్ బాంబర్ కేసును రుద్రనేత్రకు చెందిన ఏజెంట్ చారి (వెన్నెలకిషోర్) చేపడతాడు.ఇక కెమికల్ క్యాప్సుల్ వేసుకున్న వారు సూసైడ్ బాంబర్స్‌గా మారుతున్నారని చారి ఇన్వేస్టిగేషన్‌లో తేలుతుంది. అయితే ఆ కెమికల్ క్యాప్సుల్ తయారు చేస్తోన్న రావణ్ ఎవరు? రావణ్‌కు ఆర్మీలో ప్రసాదరావుకు పరిచయమైన మహికి ఉన్న సంబంధం ఏమిటి? చారితో పాటు మరో ఏజెంట్ ఈషా (సంయుక్త విశ్వనాథన్) రావణ్‌ను పట్టుకున్నారా? సీరియస్ కేసు సాల్వ్ చేసే క్రమంలో చారి ఎలాంటి హంగామా సృష్టించాడు? అన్నదే చారి 111 మూవీ కథ. మరి ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం తెలియాలంటే త్వరలో ఓటీటీలోకి చారి 111 వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే. మరి, త్వరలో వెన్నెల కిషోర్ చారి 111 సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.