P Krishna
తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు చంద్రమోహన్ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు.
తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు చంద్రమోహన్ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు.
P Krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటులు చంద్రమోహన్ (82) హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారే విషాదంలో మునిగిపోయింది. చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయన తర్వాత హీరోగా ఎదిగారు. చంద్రమోహన్ సరసన నటించిన దాదాపు 60 మంది హీరోయిన్లలో చాలా మంది స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు. తెలుగు ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రస్థానంలో ఎప్పుడూ ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లలేదని మంచి పేరు చంద్రమోహన్ కి ఉంది. పేరు, డబ్బు, బంధాలు శాశ్వతం కాదని, నమ్మకద్రోహులు పక్కనే ఉంటారని, ఆర్థికంగా జాగ్రత్త పడితే జీవితం సాఫీగా సాగుతుందని ఎలాంటి చేదు నిజాన్నైనా గుండెల్లో దాచుకోవాలని సినీ జీవితం నాకు చాలా చేర్పింది అంటూ పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. తన ఆత్మగౌరవాన్ని కించపరిచినందుకు అప్పట్లో స్టార్ హీరో, నిర్మాత, దర్శకుడిని ఎదిరించి నిలిచారు. ఇంతకీ ఎవరా హీరో అన్న విషయం గురించి తెలుసుకుందా.
తెలుగు ఇండస్ట్రీలో హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు చంద్రమోహన్. కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు. దాదాపు 932 చిత్రాల్లో నటించిన చంద్రమోహన్ చిన్న నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టి, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించారు. ఎప్పుడూ నవ్విస్తూ.. ఉండే చంద్రమోహన్ ఇండస్ట్రీలో చాలా సౌమ్యుడి గా ఉంటారని టాక్. ఎవరితోనూ గొడవలు లేకుండా సెట్స్ లో నవ్వులు పండిస్తూ హ్యాపీగా ఉంటారని సహనటులు అంటుంటారు. చంద్రమోహన్ సినీ కెరీర్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు సినిమా చాన్సులు ఇచ్చినట్టే ఇచ్చి., తొలగించేవారు. దాంతో ఆయన ఎంతో బాధపడేవారు. ఆయన కెరీర్ లో ఒక సంఘటన చాలా వివాదాస్పదం అయ్యిందని అంటారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన అన్నదమ్ముల అనుబంధం మూవీ లో ముందుగా ఎన్టీఆర్ తమ్ముళ్ళుగా మురళీమోహన్, చంద్రమోహన్ లను అనుకున్నారు. దాదాపు ఇరవై రోజుల వరకు చంద్రమోహన్ తో డ్యాన్సులు కూడా చేయించారు.
ఇక షూటింగ్ మొదలు పెట్టబోయే రెండు రోజుల ముందు ఎన్టీఆర్.. చంద్రమోహన్ కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన తనయుడు బాలకృష్ణను పెట్టుకున్నారు. అప్పటికే హీరోగా మంచి ఫామ్ లో ఉన్న చంద్రమోహన్ కి ఈ విషయం తెలియక షూటింగ్ కి వెళ్లారు. కానీ అక్కడ ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. షూటింగ్ మొదలైన తర్వాత ఆయన చేయాల్సిన పాత్ర బాలకృష్ణ చేయడం చూసి అవమానంగా భావించాడు. వెంటనే అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి పోయారు. కొన్నిరోజుల తర్వాత ఎన్టీఆర్ ఈ విషయాన్ని గ్రహించి ఇద్దరు వ్యక్తులను పంపించి అన్నగారు మీకు మరో సినిమాలో ఛాన్స్ ఇస్తామని చెప్పారు. అప్పటికే కోపంగా ఉన్న చంద్రమోహన్.. ‘ఎవరికి కావాలి మీ అన్న అవకాశాలు.. సహ నటులను గౌరవించలేని ఆయన సినిమాల్లో నేను నటించే ప్రసక్తే లేదు’ అని ధైర్యంగా చెప్పి పంపించినట్లు ఇండస్ట్రీలో టాక్. ఇక ఇండస్ట్రీ అన్నతర్వాత కోపతాపాలు ఎక్కువ కాలం ఉండవంటారు.. తర్వాత వారితో కలిసి పలు చిత్రాల్లో నటంచారు చంద్రమోహన్.