iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్​ను పట్టించుకోని చంద్రమోహన్.. ఆ విషయంలో శోభన్​బాబునే ఫాలో అయ్యాడు!

  • Author singhj Published - 02:56 PM, Sat - 11 November 23

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ ఇవాళ కన్నుమూశారు. ఇండస్ట్రీకి చాన్నాళ్ల పాటు సేవలు అందించిన ఆయన.. ఒక విషయంలో సీనియర్ ఎన్టీఆర్ ఎంత చెప్పినా వినలేదట. ఆ విషయంలో శోభన్​బాబునే ఫాలో అయ్యారట.

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ ఇవాళ కన్నుమూశారు. ఇండస్ట్రీకి చాన్నాళ్ల పాటు సేవలు అందించిన ఆయన.. ఒక విషయంలో సీనియర్ ఎన్టీఆర్ ఎంత చెప్పినా వినలేదట. ఆ విషయంలో శోభన్​బాబునే ఫాలో అయ్యారట.

  • Author singhj Published - 02:56 PM, Sat - 11 November 23
ఎన్టీఆర్​ను పట్టించుకోని చంద్రమోహన్.. ఆ విషయంలో శోభన్​బాబునే ఫాలో అయ్యాడు!

టాలీవుడ్ సీనియర్ నటుడు, ఒకప్పటి హీరో చంద్రమోహన్ ఇకలేరనే వార్తను విని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తన అద్భుతమైన నటనతో ఎందరో ఫ్యాన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన అకాల మరణం టాలీవుడ్​కు తీరని లోటు అనే చెప్పాలి. 55 ఏళ్ల పాటు తెలుగు కళామతల్లికి సేవలు అందించిన ఆయన.. గత ఆరేళ్లుగా సిల్వర్​స్క్రీన్​కు దూరంగా ఉంటున్నారు. మధుమేహం, కిడ్నీల సమస్య, హృద్రోగంతో బాధపడుతుండటమే ఆయన మూవీస్​కు దూరమవ్వడానికి కారణమని తెలుస్తోంది. అయితే ఆ వ్యాధులతో ఫైట్ చేస్తూనే ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కళాతపస్వి కే విశ్వనాత్ కన్నుమూసినప్పుడు ఆయనకు నివాళులు అర్పించేందుకు బయటకు వచ్చారు చంద్రమోహన్. అప్పుడు ఈ సీనియర్ నటుడ్ని చూసిన జనాలు షాకయ్యారు. చంద్రమోహన్ ఇలా అయిపోయారేంటని అందరూ అనుకున్నారు.

అప్పటికే చంద్రమోహన్ ఆరోగ్యం బాగా పాడైంది. అయితే సహాయకులతో కలసి విశ్వనాథ్ ఇంటికి వెళ్లారాయన. అనంతరం ఆయన హెల్త్ మరింతగా క్షీణించింది. కొన్నాళ్ల కింద అపోలో ఆస్పత్రిలో చేరిన చంద్రమోహన్.. అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఇక, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువగా శోభన్​బాబుతో సన్నిహితంగా ఉండేవారు చంద్రమోహన్. వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెబుతుంటారు. ఒకర్నొకరు ఒరేయ్.. ఏరా అని పిలుచుకునేంత చనువు వీళ్లకు ఉందని అంటుంటారు. తమ ఫ్రెండ్​షిప్ గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడారు. శోభన్ బాబు కోసం సీనియర్ ఎన్టీఆర్​ను తాను కాదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్​కు తరలివచ్చినప్పుడు తమను కూడా ఎన్టీఆర్​ ఇక్కడికి వచ్చేయమన్నారని తెలిపారు. హైదరాబాద్​కు రమ్మని ఎన్టీఆర్ చెప్పినా శోభన్​బాబు, తాను వినలేదని చంద్రమోహన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘హైదరాబాద్​కు ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన అనంతరం శోభన్​బాబుతో పాటు నన్ను ఇక్కడికి వచ్చేయమని ఎన్టీఆర్ కోరారు. కానీ మేం రామని చెప్పేశాం. వేషాలు వస్తే ఫ్లైట్​లో వచ్చి లాడ్జింగ్​లో ఉంటామని చెప్పాం. కానీ ఫ్యామిలీతో ఇక్కడికి షిఫ్ట్ అవ్వలేమని చెప్పాం. అప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. పర్సనల్ రీజన్స్ వల్ల రాలేమన్నాం. చెన్నైలోని అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మాకు ఇక్కడే పిల్లలు పుట్టారు. ఇప్పుడు హైదరాబాద్ రమ్మనడం కరెక్ట్ కాదని రామారావు గారితో అన్నాను. అక్కడికి వెళ్తే మనకు రెస్పెక్ట్ ఉండదని.. అందరిలో కలసిపోతామని శోభన్​బాబు నాకు చెప్పాడు. దీంతో అతను చెప్పిందే నేను ఫాలో అయ్యా. అయితే ఫిల్మ్ నగర్ ఏర్పడిన తర్వాత యాక్టర్స్​కు గవర్నమెంట్ స్థలాలు ఇచ్చింది. అందులో భాగంగా నాకు వచ్చిన ప్లాట్​లో చిన్న గెస్ట్ హౌస్ కట్టా. ఆ తర్వాత అదే గెస్ట్ హౌస్​ను పెద్ద ఇల్లుగా మార్చుకున్నా’ అని చంద్రమోహన్ వివరించారు.

ఇదీ చదవండి: NTR‌ ని ధిక్కరించిన చంద్రమోహన్.. ఎందుకంటే?