iDreamPost
android-app
ios-app

వివాదంలో బిత్తిరి సత్తి! ఏకంగా సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు! ఏమి జరిగిందంటే?

Bitthiri Sathi: తెలుగు టెలివిజన్ లో బిత్తిరి సత్తి ప్రత్యేకమైన యాస.. వెరైటీ భాషతో.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి..తనకు సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తుంటారు. అలా ఓ వీడియో చేసిన క్రమంలో తాజాగా బిత్తిరి సత్తి వివాదంలో చిక్కుకున్నారు.

Bitthiri Sathi: తెలుగు టెలివిజన్ లో బిత్తిరి సత్తి ప్రత్యేకమైన యాస.. వెరైటీ భాషతో.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి..తనకు సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తుంటారు. అలా ఓ వీడియో చేసిన క్రమంలో తాజాగా బిత్తిరి సత్తి వివాదంలో చిక్కుకున్నారు.

వివాదంలో బిత్తిరి సత్తి! ఏకంగా సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు! ఏమి జరిగిందంటే?

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది తమదైన కామెడీతో, యాసతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటారు. కొందరు వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించి.. ఆ తరువాత బుల్లితెరపై వెండితెరపై మెరుస్తుంటారు. అలా ఎంతోమంది తెలుగు బుల్లితెర, వెండితెరపై ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటారు. అలాంటి వారిలో బిత్తిరి సత్తి అలియాస్ రవి ఒకరు. స్మాల్ స్క్రీన్ పై  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బిత్తిరి సత్తి. ఆయన చేసే స్క్రిప్ట్ లకు ఆడియన్స్ కడుబ్బా నవ్వుతారు. ఇంకా చెప్పాలంటే..బిత్తిరి సత్తి వీడియోలకే ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే..తాజాగా ఓ వివాదంలో బిత్తిరి సత్తి ఇరుక్కున్నారు. అంతేకాక ఆయనపై కొందరు ఏకంగా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు  చేశారు. ఇంతకీ అసలు బిత్తిరి సత్తి చిక్కుకున్న వివాదం ఏమిటి?, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలుగు టెలివిజన్ లో బిత్తిరి సత్తి ప్రత్యేకమైన యాస.. వెరైటీ భాషతో.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. తొలుత  న్యూస్ ఛానళ్లలో పొలిటికల్ సెటైర్లకు సంబంధించిన ప్రొగ్రామ్స్ చేసుకుంటూ కెరీర్ స్టార్ట్ చేశాడు.  ఈ క్రమంలోనే బిత్తిరి సత్తి అనే పేరుతో చేసిన క్యారెక్టర్‌తో జనాల్లో నవ్వులు పూయిస్తుండటంతో పాటు తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో ఇటు బుల్లితెరపై, అటు సినిమాల్లోనూ మంచి మంచి ఛాన్స్ లు వచ్చాయి.

ఇలా మూవీల్లో నటిచండం, సినిమా ప్రమోషన్లతో బిజీ బిజీగా ఉండే బిత్తిరి సత్తి.. యూట్యూబ్‌ వీడియోలు, కొన్ని పేరడీలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే.. చాలా విషయాలను పేరడీ చేస్తూ కామెడీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ వీడియోలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధ చేసిన తీరులో..స్నేహితుల స్వభావం గురించి ఓ శ్లోకాన్ని దాని తాత్పర్యాన్ని వివరిస్తూ వీడియో చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  భగవద్గీతలో విషయంలో ఆయన చేసిన తీరుపై  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు హిందూ సంఘాలు కూడా ఈ బిత్తిరి సత్తి చేసిన ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని వాళ్లు ఆరోపిస్తున్నారు.

ఈ సందర్బంగా  రాష్ట్రీయ వానరసేన సభ్యులకు బిత్తిరి సత్తికి మధ్య ఫోన్ లో వాగ్వాదం కూడా జరిగింది. అంతేకాదు సోషల్ మీడియాలో వీడియోను తొలగించి హిందూవులకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తాను చేసిన వీడియోపై బిత్తిరి సత్తి స్పందించాడు. తాను చేసిన వీడియోలో హిందువులను కించపరిచేలా లేవని సమర్థించుకున్నాడు. ఈ నేపథ్యంలో హిందూ వానర సేన సభ్యులు  సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. అంతేకాక బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో బిత్తిరిసత్తిపై కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.