P Venkatesh
P Venkatesh
సినీ రంగంలో రాణించాలంటే టాలెంట్ తో పాటు కాసింత అదృష్టం కూడా ఉండాలంటారు. కొందరు హీరో హీరోయిన్లకు నటించిన మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకుంటారు. కాగా సినిమాల్లోకి కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే స్టార్లుగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి హిందీ, తమిళం, మలయాళం, తెలుగుకు చెందిన చిత్రాల్లో నటించి నేమ్, ఫేమ్ సంపాదించుకుంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ పార్ట్1లో యువ నందినిగా నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ తర్వాత పార్ట్ 2 లోను మెరిసింది. ఆ చైల్డ్ ఆర్టిస్టు మరెవరో కాదు సారా అర్జున్.
సారా అర్జున్ ప్రముఖ నటుడు రాజ్ అర్జున్ కుమార్తె. తెలుగు, హిందీ సినిమాల్లో నటించారు రాజ్ అర్జున్. అయితే నటి సారా అర్జున్ ఐదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగు పెట్టింది. కమర్షియల్ యాడ్స్, పలు హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2010లో విజయ్ నటించిన దైవ తిరుమగల్ లో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ జై హో, ఇమ్రాన్ హష్మీ ఏక్ థీ దయాన్, ఐశ్వర్య రాయ్ జజ్బా సూపర్ స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలలో కనిపించింది. తెలుగులో దాగుడుమూతలు దండాకోర్ సినిమాలో నటించింది. ఇక శైవం చిత్రంలో బాలనటిగా సారా అర్జున్ మంచి ఫేమ్ తెచ్చుకుంది. 17 ఏళ్ల వయసులో అత్యధికంగా సంపాదించిన చైల్డ్ ఆర్టిస్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది. 2023 నాటికి రూ.10 కోట్లతో భారతదేశంలోనే రిచెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిలిచింది సారా అర్జున్.