Arjun Suravaram
ప్రముఖ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసు మరో కొత్త మలుపు తిరిగింది.
ప్రముఖ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసు మరో కొత్త మలుపు తిరిగింది.
Arjun Suravaram
ప్రముఖ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేణుకాస్వామి అనే ఆయన అభిమానిని హత్య చేసిన కేసులో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా ఆమె ప్రేయసి పవిత్ర గౌడను సైతం ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ ఘటన శాండిల్ వుడ్ తో పాటు మిగిలిన పరిశ్రమలోనే హాట్ టాపిక్ గా మారింది. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 14కు చేరుకుంది. ఇది ఇలా ఉంటే.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
అభిమానిని హత్య చేయించాడనే ఆరోణలతో కన్నడ స్టార్ హీరో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ కూడా పలు విషయాలను పోలీసుల విచారణలో తెలిపింది. ఇది ఇలా ఉంటే..తాజాగా రేణుకా స్వామి మృతదేహాన్ని తరలించిన కారు డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. శుక్రవారం డ్రైవర్ లొంగిపోవడంతో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది.
గురువారం రాత్రి చిత్రదుర్గంలోని డీఎస్పీ కార్యాలయంలో డ్రైవర్ లొంగిపోయాడు. రఘు అలియాస్ రాఘవేంద్ర అనే మరో నిందితుడు జూన్ 8న రేణుకా స్వామిని బెంగళూరుకు తీసుకెళ్లేందుకు ట్యాక్సీని ఏర్పాటు చేశాడు. నిందితులందరూ చిత్రదుర్గ నగరంలో రవి క్యాబ్‌లో ఎక్కి.. అదేరోజు సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. వారందరిని బెంగళూరులో వదిలిపెట్టిన అనంతరం రవి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అనంతరం రవి చిత్రదుర్గలోని టాక్సీ అసోసియేషన్ సభ్యుల వద్దకు వెళ్లాడు. అక్కడే అతడు పోలీసులకు లొంగిపోవాలని భావించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఇక ఈ కేసు గురించి చూసినట్లు అయితే..హత్యకు గురైన రేణుకాస్వామి.. పవిత్ర గౌడ మీద సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కామెంట్స్ చేయడంతోనే.. ఈ దారుణం చోటు చేసుకుంది అని పోలీసులు తెలిపారు. తమ అభిమాన హీరో అయిన దర్శన్.. పవిత్ర వల్లే భార్యకు, కుటుంబానికి దూరం అయ్యాడని రేణుక భావించాడు. హీరో మీద అభిమానం కొద్ది.. పవిత్రకు వార్నింగ్ మెసేజ్‌లు పెట్టాడు రేణుకాస్వామి. దాంతో ఆగ్రహించిన దర్శన్.. రేణుకాస్వామిని కిడ్నాప్ చేయించి.. తీవ్రంగా దాడి చేసి హత్య చేయించాడు.
అంతకంటే ముందు నిందితుల్లో ఒకరైన రఘును చిత్రదుర్గలో దర్శన్ అభిమాన సంఘాన్ని అధ్యక్షుడి నియమించబడ్డాడు. రేణుకా స్వామి గురించిన సమాచారం సేకరించేందుకు దర్శన్ అతడిని నియమించుకున్నాడని పోలీసులు తెలిపారు. రేణుకా స్వామిని తమ ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేశారని ఆయన భార్య ఆరోపించింది. అలా మొత్తంగా బెంగళూరు తీసుకెళ్లి..దారుణంగా కొట్టడంతో అతడు మరణించాడని పోలీసులు తెలిపారు. మొత్తంగా క్యాబ్ డ్రైవర్ ఎంట్రీతో దర్శన్ కేసులోని దర్యాప్తు మరో కొత్త మలుపు తిరిగింది.