iDreamPost
android-app
ios-app

వీడియో: బన్నీ- సుకుమార్ గొడవపై కుండ బద్దలు కొట్టేసిన బన్నీ వాసు!

  • Published Jul 19, 2024 | 6:45 PM Updated Updated Jul 19, 2024 | 7:01 PM

Bunny Vasu Clarity On Allu Arjun- Sukumar Issue: సుకుమార్ కు- అల్లు అర్జున్ కు గొడవలు జరుగుతున్నాయని.. అందుకే గడ్డం తీసేసి విదేశాలకు వెళ్లిపోయాడు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. పుష్ప 2 సినిమా పోస్ట్ పోన్ కూడా అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ వార్తలపై బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు.

Bunny Vasu Clarity On Allu Arjun- Sukumar Issue: సుకుమార్ కు- అల్లు అర్జున్ కు గొడవలు జరుగుతున్నాయని.. అందుకే గడ్డం తీసేసి విదేశాలకు వెళ్లిపోయాడు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. పుష్ప 2 సినిమా పోస్ట్ పోన్ కూడా అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ వార్తలపై బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు.

  • Published Jul 19, 2024 | 6:45 PMUpdated Jul 19, 2024 | 7:01 PM
వీడియో: బన్నీ- సుకుమార్ గొడవపై కుండ బద్దలు కొట్టేసిన బన్నీ వాసు!

పుష్ప 2 సినిమా రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కు వెళ్లిపోయింది. సినిమా ఆడియన్స్ అంతా పుష్పరాజ్ రూల్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే ఆగస్టులో రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6న పుష్ప రాజ్ వచ్చేస్తాడు అని అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమాకి సంబంధించి చాలానే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బన్నీ- సుకుమార్ గొడవ పడ్డారని.. అందుకే బన్నీ గడ్డం తీసేసి విదేశాలకు వెళ్లిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలపై క్లారిటీ ఇవ్వగలిగిన వాళ్లు బన్నీ- సుకుమార్.. వాళ్ల తర్వాత బన్నీ వాసు అనే చెప్పాలి. ఇప్పుడు ఆయనే స్వయంగా ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేశాడు. ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఈ గొడవకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

బన్నీ వాసు ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా బన్నీ వాసుకు పుష్ప 2 సినిమాకి సంబంధించి ప్రశ్న ఎదురైంది. సుకుమార్- బన్నీల మధ్య గొడవలు అంటూ వార్తలు వస్తున్నాయి. అది ఎంత వరకు నిజం అని అడిగారు. అయితే అవన్నీ చెప్తే ఆయ్ సినిమా సైడ్ ట్రాక్ లోకి వెళ్తుందని మొదట నిరాకరించారు. కనీసం గడ్డం తీసేసింది ఎందుకు అదైనా చెప్పండి అని మళ్లీ రిక్వెస్ట్ చేశారు. ఇంక చేసేది లేక బన్నీ వాసు అసలు విషయాన్ని.. ఆ గడ్డం తీయడానికి గల కారణాన్ని కూడా వివరించారు. పనిలో పని పుష్ప 2 షూటింగ్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు.

బన్నీ వాసు మాట్లాడుతూ.. “ఆ వార్త ఒకటి నాకు కూడా మా మిత్రులు చూపించారు. నిజంగా మేము ఆ వార్త చూసి నవ్వుకుంటున్నాం.. ఫ్రీ పబ్లిసిటీ.. లెట్ ఇట్ గో అనే మేము అనుకుంటున్నాం. సుకుమార్ ప్రస్తుతం ఎడిటింగ్ చూసుకుంటున్నారు. బన్నీకి సంబంధించి క్లయిమ్యాక్స్, ఒక సాంగ్ పెండింగ్ ఉంది. ఫహద్ ఫాజిల్ వర్క్ ఎక్కువ ఉండిపోయింది. ఏప్రిల్, మే నెలల్లో ఆయన డేట్స్ కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. బన్నీ షూట్ హానెస్ట్ గా 15 నుంచి 17 రోజులు మాత్రమే ఉంది. సుకుమార్ గారు అన్నది.. ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే.. ఫస్టాఫ్, సెకండాఫ్ లో ఎక్కడైనా లింకులు ఉంటే కూడా లాస్ట్ లో చేసుకోవచ్చు అని చెప్పారు.

ఈ 35 డేస్ గ్యాప్ ని బన్నీ కాలుక్యూలేట్ చేసుకుని ఫ్యామిలీతో ఇటలీకి వెళ్లారు. ఒక నెల రోజుల గ్యాప్ చూసుకుని ఆయన గడ్డం తీసేశాడు. దానిని ఇంతలా బీభత్సం చేశారు. ఎవరు ఏం అనుకున్నా కూడా ఇది ఫ్యాక్ట్. సుకుమార్ తో నాకు, బన్నీకి స్పెషల్ బాండింగ్ ఉంది. సుక్కు.. ఇంకో 6 నెలలు షూటింగ్ ఉంది అన్నా కూడా బన్నీ వెళ్లిపోతాడు. వాళ్ల మధ్యలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆగస్టు ఫస్ట్ వీక్ లో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది కూడా” అంటూ బన్నీ వాసు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇకనైనా ఆ పుకార్లు ఆగుతాయోమో చూడాలి మరి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş