iDreamPost
android-app
ios-app

మెగా ఫ్యామిలీతో గొడవలపై బన్నీ ఫుల్ స్టాప్..!

  • Published Oct 11, 2024 | 1:00 PM Updated Updated Oct 11, 2024 | 1:01 PM

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ నడిచింది అంటే అది అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ గొడవల గురించే. ఇప్పటికీ ఈ ఇష్యూ కంటిన్యూ అవుతూనే ఉంది. ఫ్యాన్స్ వార్ కు కారణమైంది. కానీ వీటికి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ నడిచింది అంటే అది అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ గొడవల గురించే. ఇప్పటికీ ఈ ఇష్యూ కంటిన్యూ అవుతూనే ఉంది. ఫ్యాన్స్ వార్ కు కారణమైంది. కానీ వీటికి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.

  • Published Oct 11, 2024 | 1:00 PMUpdated Oct 11, 2024 | 1:01 PM
మెగా ఫ్యామిలీతో గొడవలపై బన్నీ ఫుల్ స్టాప్..!

ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ ఇష్యూ. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు విబేధాలు వచ్చాయని మీడియా, సోషల్ మీడియా కోడై కూస్తోంది.  ఒకటికి రెండు జోడించి కథలు అల్లేయడంతో మెగా, అల్లు అభిమానుల మధ్య కూడా కోల్ట్ వార్ నడిచింది. పాత విషయాలన్నీ తవ్వి ట్రోలింగ్ చేశారు. మెగాస్టార్ లేకపోతే అల్లు అర్జున్ లేడని, అల్లు రామలింగయ్య లేకపోతే మెగాస్టార్ లేడంటూ నాన్సెస్ క్రియేట్ చేశారు. కానీ అటు అల్లు,  ఇటు మెగా ఫ్యామిలీ కానీ నోరు మెదపలేదు. అలాగని ఖండించనూ లేదు. ఈ క్రమంలోనే తనకు నచ్చితే ఎంతదూరమైనా వెళతా అంటూ, మనసుకు నచ్చిన వారి కోసం వస్తాను అంటూ ఓ సినీ వేడుకలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలను ఈ గొడవలకు ముడిపెట్టేశారు నెటిజన్లు. దీంతో వీరి మధ్య ఏదో జరుగుతుందన్న పుకార్లు మాత్రం షికార్లు చేస్తూనే ఉన్నాయి. అయితే వీటికి ఫుల్ స్టాఫ్ పడ్డాయని తెలుస్తోంది.

ఈ రూమర్లకు స్వయంగా అల్లు అర్జునే చెక్ పెట్టాడని సమాచారం. నందమూరి బాలకృష్ణతో ఈ విషయాలు పంచుకున్నాడట బన్నీ. ఎక్కడ అనుకుంటున్నారా అన్ స్టాపబుల్ షోలో. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో.. నాల్గవ సీజన్‌కు రెడీ అవుతుంది. బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ టాక్ షోకు ఫస్ట్ గెస్ట్‌గా హాజరయ్యాడట స్టైలిస్ట్ స్టార్. ఎన్నో విషయాలను పంచుకున్నాడట. మేనమామ పవన్ కళ్యాణ్ ప్రచార సభకు వెళ్లకుండా.. నంద్యాల వెళ్లడానికి కారణాలను వివరించారట. అలాగే మెగా ఫ్యామిలీతో ఉన్న విభేదాలపై కూడా నోరు విప్పాడట. చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చేసారట. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరు ఎదురు చూస్తున్నారు. ఈ షో ద్వారా అయినా వీడి గొడవలు తగ్గిపోతాయా లేక.. కొత్తగా మళ్లీ ఏమైనా చర్చకు దారి తీసే అంశాలున్నాయా అన్న సందేహం నెలకొంది సినీ వర్గాల్లో.

ఇదిలా ఉంటే.. తాను కట్టే కాలేంత వరకు చిరంజీవి అభిమానినే అంటూ అల్లు అర్జున్ గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. మా మధ్య విబేధాలు లేవని ప్రయత్నించేందుకు ట్రై చేస్తున్నారు బన్నీ. వరద బాధితుల సమయంలో ఏపీకి రూ. 50 లక్షల సాయం అందించడంతో పాటు.. మేనమామలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుల సందర్భంగా ఇద్దరికి విషెస్ తెలియజేశాడు ఐకాన్ స్టార్. మేనమామలు సైతం రిప్లై ఇచ్చారు.  వీటన్నింటినీ లెక్కల్లోకి తీసుకోకుండా..  నెటిజన్లు మాత్రం ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక అన్ స్టాపబుల్ షోపైనే హోప్స్ ఉన్నాయి. ఈ టాక్ షో రిలీజయ్యాక.. ఈ ఇష్యూకు ఫుల్ స్టాప్ పడుతుందని, మళ్లీ తిరిగి మెగా అండ్ అల్లు ఫ్యామిలీ ఒక్కటి కాబోతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మెగా, అల్లు అభిమానులు, సినీ వర్గాలు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio