Krishna Kowshik
RC 16.. మూడేళ్ల క్రితం మొదలు పెట్టిన గేమ్ ఛేంజర్ ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేశాడు నిర్మాత దిల్ రాజు. ఇదిలా ఉంటే.. బుచ్చి బాబుతో నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు చెర్రీ. ఈ నేపథ్యంలో మిస్టేక్ రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటున్నాడు.
RC 16.. మూడేళ్ల క్రితం మొదలు పెట్టిన గేమ్ ఛేంజర్ ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేశాడు నిర్మాత దిల్ రాజు. ఇదిలా ఉంటే.. బుచ్చి బాబుతో నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు చెర్రీ. ఈ నేపథ్యంలో మిస్టేక్ రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటున్నాడు.
Krishna Kowshik
తండ్రి నుండి నటనను వారసత్వంగా తెచ్చుకున్నప్పటికీ.. తనకంటూ స్పెషల్ పాత్ ఏర్పాటు చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మగధీరతో స్టార్ హీరోగా మారితే.. ఆర్ఆర్ఆర్ గ్లోబట్ స్టార్‌ను చేసింది. ఆ తర్వాత వచ్చిన ఆచార్య నిరాశపరిచింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌తో పాటు బుజ్జిబాబు సినిమాలు చేస్తున్నాడు చెర్రీ. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ ఈ ఏడాది చివరిలో రాబోతున్నట్లు ప్రకటించాడు దిల్ రాజు. క్రిస్మస్‌కు కలుద్దామంటూ రాయన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పేశాడు నిర్మాత. దీంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు ఫ్యాన్స్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, జయరామ్, సునీల్, ప్రకాష్ రాజ్, సముద్ర ఖని, నాజర్, నవీన్ చంద్ర, శుభలేక సుధాకర్, మురళీ శర్మ వంటి స్టార్ నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ మూవీకి థమన్ బాణీలు సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే రామ్ చరణ్ టాకీ పూర్తి అయినట్లు తెలుస్తుంది. పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే.. ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో సినిమాను ఎనౌన్స్ చేశాడు చెర్రీ. షూటింగ్ కాస్ట్ కాల్, ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇందులో దేవర బ్యూటీ, బాలీవుడ్ నటి, ఒకప్పటి అందాల తార శ్రీదేశి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఉండనుందట. పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రామ్ చరణ్ 16న తెరకెక్కబోతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో ఉందట. అందుకు తగ్గట్లుగా మెగా పవర్ స్టార్ మేకోవర్ అవుతున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఇప్పుడో ఇండస్ట్రింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమా సెట్స్‌కు వెళ్లకుండా పాటలు సిద్ధమయ్యాయట. ఇప్పటికే ఆయన మూడు పాటలకు ట్యూన్స్ రెడీ చేయించినట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ భారీ కాల్షీట్లు ఇవ్వడంతో ఆ సినిమాకు స్ట్రక్ అయిపోయాడు. సుమారుగా మూడేళ్ల పాటు ఈ మూవీతోనే జర్నీ చేశారు. ఇలాంటి మిస్టేక్ రిపీట్ కాకూడదన్న ఉద్దేశంతో ముందుగానే మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేయించుకుంటున్నాడట బుచ్చిబాబు. మిగిలిన టీం సభ్యుల్ని దర్శకుడు బుచ్చిబాబు ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని లండన్ టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాట్లు చేయనున్నారు.