iDreamPost
android-app
ios-app

Hanuman: దిల్ రాజుకి హనుమాన్ పవర్ తెలియడం లేదా? ఊహల్లో ఉన్నారా?

నిర్మాత దిల్‌ రాజు గుంటూరు కారం సినిమాకు సంబంధించి నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఆయన హనుమాన్‌ సినిమా గురించి మాట్లాడారు.

నిర్మాత దిల్‌ రాజు గుంటూరు కారం సినిమాకు సంబంధించి నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఆయన హనుమాన్‌ సినిమా గురించి మాట్లాడారు.

Hanuman: దిల్ రాజుకి హనుమాన్ పవర్ తెలియడం లేదా? ఊహల్లో ఉన్నారా?

హనుమాన్‌ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. సంక్రాంతికి హనుమాన్‌కు గట్టిపోటీ ఉంది. స్టార్‌ హీరోల సినిమాలు గుంటూరు కారం, సైంధవ్‌, నా సామిరంగలు కూడా అప్పుడే వస్తున్నాయి. గుంటూరు కారం 12వ తేదీన, సైంధవ్‌ 13వ తేదీన, నా సామిరంగ 14వ తేదీన విడుదల కానుంది. అయితే, పోటీ కారణంగా హనుమాన్‌ తరచుగా వివాదాల్లో నిలుస్తోంది.

దిల్‌ రాజు హనుమాన్‌ విడుదలపై చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో మాట్లాడారు. సంక్రాంతికి స్టార్‌ హీరోలతో పాటు బరిలో దిగితే ‘హనుమాన్‌’ నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. అయితే, కొన్ని బలమైన కారణాల వల్ల తాము పోటీనుంచి వెనక్కు తప్పుకోలేమని ప్రశాంత్‌ తేల్చి చెప్పాడు.  తాజాగా, దిల్‌ రాజు ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ‘ ఆడియన్స్‌ ఎగ్జైట్‌మెంట్‌తో పెద్ద సినిమాలకు మార్నింగ్‌ షోలకు వెళతారు. అలా చూసుకుంటే.. మహేష్‌ గారి సినిమాకు ఎక్కువ స్క్రీన్‌లు వెళతాయి. ఆ తర్వాత వెంకటేష్‌, నాగార్జున గారి సినిమాలకు వెళ్తాయి. ఆ తర్వాతే హనుమాన్‌. ఆ సినిమాకు కూడా సహకరిస్తాం’ అని అన్నారు. అయితే, దిల్‌ రాజు అంచనా నూటికి నూరు శాతం తప్పని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే.. గుంటూరు కారం సినిమాతో హనుమాన్‌ పోటీ పడుతోంది. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌కు సంబంధించి.. బుక్‌మై షోలో హనుమాన్‌ పేరిట రికార్డు కూడా ఉంది. గుంటూరు కారాన్ని మించి హనుమాన్‌కు ఎక్కువ మంది ఓటు వేశారు. తాము హనుమాన్‌ చూడ్డానికి ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. హనుమాన్‌ పేరిట ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్‌ అయ్యాయి కూడా. అంతేకాదు! ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్‌కు పరుగులు పెట్టడానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హనుమాన్‌కు ఉన్నాయి. దీనికి తోడు దేవుడి సెంటిమెంట్‌ కచ్చితంగా వర్కవుట్‌ అవుద్ది.

దీన్ని బట్టి చూస్తే.. గుంటూరు కారం, సైంధవ్‌, నా సామిరంగ సినిమాలకు హనుమాన్‌ ఏ మాత్రం తక్కువ కాదు. దిల్‌ రాజుకు హనుమాన్ పవర్ తెలియడం లేదా? ఊహల్లో ఉన్నారా? అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికి హనుమాన్‌ విశ్వరూపం ఏంటో చూడాలంటే.. 12వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. మరి, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ‘హనుమాన్‌’ సినిమాపై చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.