iDreamPost
android-app
ios-app

Disha Patani : దిశా పటానీ టాటు పై రచ్చ.. ప్రభాస్ కి లింక్ చేస్తూ న్యూస్ వైరల్!

  • Published Jul 02, 2024 | 4:23 PM Updated Updated Jul 02, 2024 | 4:23 PM

బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ తాజాగా కల్కి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీకు సంబంధించి టాట్ పై ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చే మొదలైంది. అయితే ఈ టాటూ కు గల అర్ధం అదేనా అంటూ నెట్టింట అందరూ చర్చించుకుంటున్నారు.

బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ తాజాగా కల్కి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీకు సంబంధించి టాట్ పై ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చే మొదలైంది. అయితే ఈ టాటూ కు గల అర్ధం అదేనా అంటూ నెట్టింట అందరూ చర్చించుకుంటున్నారు.

  • Published Jul 02, 2024 | 4:23 PMUpdated Jul 02, 2024 | 4:23 PM
Disha Patani : దిశా పటానీ టాటు పై రచ్చ.. ప్రభాస్ కి లింక్ చేస్తూ న్యూస్ వైరల్!

బీ టౌన్ బ్యూటీ ‘దిశా పటానీ’.. చాలా ఏళ్ల తర్వాత ఈ బ్యూటీ మళ్లీ కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈమె గతంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దిశా ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. మళ్లీ బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. కాగా, ఇటీవలే మళ్లీ కల్కి సినిమాతో తెలుగు తెరపై అలరించిన ఈ బ్యూటీ పై ఇప్పుడు నెట్టింట ఓ రచ్చ నడుస్తుంది. ఎందుకంటే.. ప్రస్తుతం ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు(టాటు) అనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తుంది. ఇంతకి ఏం జరిగిందంటే..

బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ చేతిపై ‘PD’ అనే రెండు అక్షరాలతో ఓ పచ్చబొట్టు ఉంది. అయితే ఈ టాట్ కాస్త వైరల్ కావడంతో.. దీనిని గమనించిన చాలామంది నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ కు అనేక ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఆ టాటు అర్ధం PD అంటే ‘ప్రభాస్‌ డార్లింగ్‌’ అని కొంతమంది చెప్తున్నారు. ఇక ఈ టాటూ అర్ధం కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే కల్కి సినిమాలో దిశా నటించడం వలనే కారణం అని చర్చించుకుంటుంటే.. మరి కొందరు అభిమానులు మాత్రం దిశాను ప్రభాస్ డార్లింగ్ అనే పేరు టాటూగా ఎందుకు తీసుకున్నావ్ అంటూ కామెంట్ల్ చేస్తున్నారు.

ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు రకరకాలుగా ఊహించుకుంటూ ఆ టాటూ అర్ధం వారే చెప్పేసుకుంటూ.. చర్చలు పెట్టేస్తున్నారు. కానీ, నిజానికి ఈ పుకార్లు అన్ని పక్కన పెట్టి ఆలోచించి ఒక నిర్ధారణకు రావాలి. ఎందుకంటే.. దిశా పటాని కల్కి 2898 AD కోసం ఏ ఈవెంట్స్ లో పాల్గొనలేదు. అలాగే కల్కి సినిమాలో ప్రభాస్ తో ఆమెకు ఎక్కువగా సీన్లు కూడా లేవు. అయిన వారిద్దరి మధ్య ఇంతకు ముందు స్నేహం కానీ, ఆ బాండింగ్ అంటూ ఏమి లేదు కనుక ఈ టాట్ పై వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్ అని చెప్పవచ్చు.ఇక ఈ విషయం పక్కన పెడితే.. అసలు టాటూ లోని “PD” అక్షరాలు అసలు అర్ధం ఆమె పేరు. ఎందుకంటే.. ఈ అమ్మడు పేరు దిశా పటాని. అయితే DP అనే అనే అక్షరాలను రివర్స్ వెర్షన్ కావచ్చని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ టాటూ వెనుక రూమర్స్, దాని అసలు అర్ధం తెలియాలంటే.. చివరికి దిశా పటానీ స్పందించి రివీల్ చేసేంతవరకు వేచి ఉండాల్సిందే.

కాగా, ఇప్పటికే ఈ వార్త కాస్త వైరల్ అవ్వడంతో.. అటూ ప్రభాస్ అభిమానులు ఇలా ఎంతమందితో లింక్ చేస్తారంటూ ఫైర్ అవుతున్నారు. మరొపక్క దిశా పటానీ ఇప్పటికే డేటింగ్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.కాగా, ఈమె భాఘీ 2, భాఘీ 3 సినిమాల్లో తనతో పాటు కలిసి నటించిన టైగర్ ష్రాఫ్‌తో ఆమె చాలాకాలం నుంచి రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఆక్ష్నతో బ్రేకప్ అయ్యాక విదేశీ మోడల్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. మరి, దిశా పటానీ టాటూ పై వస్తున్న రూమర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet