Arjun Suravaram
ఏప్రిల్ 14న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఏప్రిల్ 14న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది.
Arjun Suravaram
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్టమెంట్ వద్ద కాల్పుల జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ కు భద్రత భారీగా పెంచడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ కేసు విషయంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తి కస్టడీలో ఆత్మహత్యకు యత్నించాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఏప్రిల్ 14న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక సల్మాన్ ఖాన్ ఇంటికి భద్రతను పెంచారు. ఇది ఇలా ఉంటే. ఈ కాల్పుల ఘటన కేసులో నిందుతుల్లో ఒకరైనా అనుజ్ థాఫన్(32) పోలీసుల కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యయత్నానికి యత్నించగా..పోలీసులు గుర్తించి వెంటనే సమీపంలోని ఆస్పత్రిలోకి చేర్చారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పులు జరిగిన కేసులో షూటర్లకు ఆయుధాలు అందించినట్లు అనూజ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడి కస్టడికి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే సమయంలో అనూజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఈ కాల్పులు జరిపిన విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21) తో పాటు వారికి ఆయుధాలు అందించాడనే ఆరోపణతో అనుజ్ థాపన్ (32) అనే నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ను విధించారు. ఇక ఈ కేసులో అరెస్టైన నిందితుల కస్టడీని మరోసారి మే 8 వరకు పొడిగించడం జరిగింది. ఈ కస్టడి పొడింగిచిన సమయంలోనే ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరి మీద ముంబై పోలీసులు ఈ యాక్ట్ ను విధించారు. ఇదిలా ఉంటే అనూజ్ థాపన్ పోలీసు కస్టడీలో ఆత్మహత్య యత్నించాడు. దీనితో అతని పరిస్థితి విషమంగా మారడంతో ముంబైలోని జీటీ ఆస్పత్రికి తరలించారు.
ఏప్రిల్ 14నజరిగిన ఈ కాల్పుల ఘటనతో పోలీసులు సల్మాన్ ఖాన్ కి భద్రత కట్టుదిట్టం చేశారు. గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నుంచి బెదిరింపులు తరువాత సల్మాన్ కి భద్రత స్థాయిని వై-ప్లస్ కి పెంచారు. అందుకే ఆయనకు వ్యక్తిగతంగా గన్ తీసుకెళ్లడానికి కూడా అధికారం ఉంది. మొత్తంగా సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
Salman Khan residence firing case | Accused Anuj Thapan who attempted suicide in custody has been declared dead by doctors at the hospital: Mumbai Police https://t.co/3OMrikn0nP
— ANI (@ANI) May 1, 2024