iDreamPost
android-app
ios-app

అందం లేదు, యాక్టింగ్ రాదంటూ.. గ్లోబల్ స్టార్ బ్యూటీ పై దర్శకుడి కామెంట్స్

  • Published Jul 20, 2024 | 3:24 PM Updated Updated Jul 20, 2024 | 3:24 PM

సినీ ఇండస్ట్రీలో అవమానాలు, విమర్శలు చీదరింపులు, భరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తారల విషయంలో అయితే చాలా చులకన భావం ఉంటుంది. చాలామందికి కెరీర్ మొదట్లో అసలు సినిమా ఫీల్డ్ కి పనికిరారని, నల్లగా ఉన్నారని, బాడీ షేమింగ్స్, ఏదీ చేతకాదని, ఏకీ పారేస్తుంటారు. అలాంటి వారిలో ఈ స్టార్ నటి కూడా ఒకరు. ఈమె కెరీర్ లో చాలా అవమానాలు ఎదుర్కొంది.

సినీ ఇండస్ట్రీలో అవమానాలు, విమర్శలు చీదరింపులు, భరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తారల విషయంలో అయితే చాలా చులకన భావం ఉంటుంది. చాలామందికి కెరీర్ మొదట్లో అసలు సినిమా ఫీల్డ్ కి పనికిరారని, నల్లగా ఉన్నారని, బాడీ షేమింగ్స్, ఏదీ చేతకాదని, ఏకీ పారేస్తుంటారు. అలాంటి వారిలో ఈ స్టార్ నటి కూడా ఒకరు. ఈమె కెరీర్ లో చాలా అవమానాలు ఎదుర్కొంది.

  • Published Jul 20, 2024 | 3:24 PMUpdated Jul 20, 2024 | 3:24 PM
అందం లేదు, యాక్టింగ్ రాదంటూ.. గ్లోబల్ స్టార్ బ్యూటీ పై దర్శకుడి కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో యాక్టర్స్ నుంచి స్టార్ యాక్టర్స్ ట్యాగ్ ను తగిలించుకోవడం అంతా ఈజీ కాదు. ఎందుకంటే.. ఈ సినీ ప్రయాణంలో చాలామంది ఎన్నో విమర్శలు, అవమానాలు, చీదరింపులు, భరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తారల విషయంలో అయితే చాలా చులకన భావం ఉంటుంది. చాలామందికి కెరీర్ మొదట్లో అసలు సినిమా ఫీల్డ్ కి పనికిరారని, నల్లగా ఉన్నారని, బాడీ షేమింగ్స్, ఏదీ చేతకాదని, ఏకీ పారేస్తుంటారు. అయితే ఇవన్నీ దాటుకొని స్టార్స్ ఎదుగుతున్న సమయంలో.. వారి ఎదుగదలను చూసి ఓర్వలేనివారు ఎదో ఒక రకంగా వారిపై నెగిటివ్ ప్రచారం చేస్తుంటారు.

అయిన సరే తట్టుకుని పడినచోట గర్వంగా తలెత్తుకునేలా కొంతమంది ముద్దుగుమ్మలు తమ సత్తాను చాటుతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబుతున్న హీరోయిన్ కూడా ఒకరు. ఈమె కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడింది. ముఖ్యంగా ఈమె కెరీర్ మొదట్లో యాక్టింగ్ రాదని, అసలు అందంగా లేదని కామెంట్స్ ఎదురైయ్యాయట. ఇంతకి మరి ఆ నటి ఎవరో కాదు.. గ్లోబల్ స్టార్ ‘ప్రియాంక చోప్రా’. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె మొదటిగా విజయ్‌ నటించిన ‘తమిళన్‌’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే.. సల్మాన్‌ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, అజయ్‌ దేవ్‌గణ్‌లతోపాటు యువ హీరోలతోనూ ఆమె స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు.

అయితే కెరీర్ ప్రారంభంలో ఈ బ్యూటీ ఎన్నో అవమానాలు ఎదుర్కొందట.ఇక ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు గుడడు ధనోవా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.  ఈ సందర్భంగా దర్శకుడు గుడడు మాట్లాడుతూ.. ‘ప్రియాంక చోప్రా మొదటిగా యాక్టింగ్‌పై ఎటువంటి అవగాహన లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  కానీ ఆమెలో నేర్చుకోవాలనే తపన ఉండేది. ఇక ప్రియాంకతో, సన్నీ డియోలో హీరోగా 2002-2003 మధ్య ‘బిగ్‌ బ్రదర్‌’  సినిమాను తెరకెక్కించాను. అయితే  ఆ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు ప్రియాంక నా వద్దకు వచ్చి.. ”సార్ దయచేసి ఈ సీన్స్ ఎలా చేయాలో చెప్పండి? ఈ సన్నివేశం గురించి కాస్త వివరించరా”? అని అడిగి మరీ తెలుసుకుని నటించేది. అలాగే తన పాత్రకు న్యాయం చేయాలని చాలా శ్రమించేది. అలా దాదాపు దాదాపు 20 రోజుల షూటింగ్‌ తర్వాత ఆమె అందంగా లేదు, నటన కూడా బాలేదంటూ ముంబయిలో కొందరు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. పైగా స్క్రీన్‌పై తను అంత అందంగా కనిపించదని, యాక్టింగే రాదని, టైం వేస్ట్‌ చేసుకోవద్దని, కావాలంటే ఇప్పటివరకు షూట్‌ చేసిన రషెస్‌ ఓసారి చూసుకోమని సలహాలు ఇచ్చారు.

దీంతో సరేనని చెప్పి సన్నీ డియోల్‌, నేను రషెస్‌ చూశాం. వాళ్లు చెప్పినట్లుగా ఏమీ అనిపించలేదు. వెంటనే ఈ సినిమా తనతోనే పూర్తి చేయాలని డిసైడ్‌ అయ్యాం. తన అంకితభావానికి, నటనకు మేము ఫిదా అయ్యాం. తప్పకుండా తను ఏదో ఒకరోజు గొప్ప స్థానానికి వెళ్తుందని భావించాం. అలా అనుకున్న విధంగానే  చాలా త్వరగా ఆమె  స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. తన వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు సైతం నన్ను ఆహ్వానించింది’ అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇకపోతే గుడ్డు ధనోవా దర్శకత్వంలో  ప్రియాంక చోప్రా.. బిగ్‌ బ్రదర్‌, కిస్మత్‌ అనే సినిమాలు చేసింది. మరి, బాలీవుడ్ దర్శకుడు గుడ్డు ధనోవా, ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.