iDreamPost
android-app
ios-app

కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటి? ఫేక్ కలెక్షన్స్ నిజమేనా?

What is Corporate Booking in Bollywood: బాలీవుడ్‌లో కొత్త కొత్త మాఫియాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. తాజాగా, సందీప్‌ రెడ్డి సోదరుడు ప్రణయ్‌ రెడ్డి బాలీవుడ్‌లో జరిగే కార్పోరేట్‌ బుకింగ్స్‌ మాట్లాడారు. దీంతో కార్పోరేట్‌ బుకింగ్స్‌పై చర్చ మొదలైంది.

What is Corporate Booking in Bollywood: బాలీవుడ్‌లో కొత్త కొత్త మాఫియాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. తాజాగా, సందీప్‌ రెడ్డి సోదరుడు ప్రణయ్‌ రెడ్డి బాలీవుడ్‌లో జరిగే కార్పోరేట్‌ బుకింగ్స్‌ మాట్లాడారు. దీంతో కార్పోరేట్‌ బుకింగ్స్‌పై చర్చ మొదలైంది.

కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటి? ఫేక్ కలెక్షన్స్ నిజమేనా?

కలెక్షన్‌.. హీరో సత్తాను.. సినిమా సత్తాను నిర్ధేశించే కొలమానంగా మారిపోయింది. ప్రేక్షకుల్ని మెప్పించి బొమ్మ హిట్టవటం ఒక ఎత్తయితే.. మొదటి రోజు ఎంత కలెక్ట్‌ చేసింది.. థియేటర్లలో ఉన్నన్ని రోజుల మొత్తం కలెక్షన్‌ ఎంత అన్నది అత్యంత ముఖ్యమైన విషయంగా మారింది. అందుకే టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ కలెక్షన్ల మీద దృష్టి పెట్టాయి. కలెక్షన్లను సాధించే విషయంలో బాలీవుడ్‌లోని ఓ మాఫియా గ్యాంగ్‌ ఎత్తులు, పైఎత్తులు వేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పోటీ వచ్చే సినిమాలపై పగ బడుతుంది.

తాజాగా, సలార్‌ విషయంలో ఇదే జరిగింది. సలార్‌ డిసెంబర్‌ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాగా.. షారుఖ్‌ ఖాన్‌ నటించిన డంకీ మూవీ డిసెంబర్‌21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు సినిమాల మధ్య థియేటర్ల విషయంలో గొడవ మొదలైంది. డంకీ సినిమా నిర్మాతలు సలార్‌కు నార్త్‌లో థియేటర్లు దొరక్కుండా చేయడానికి విశ్వ ప్రయత్నమే చేశారు.  అందులో చాలా వరకు సఫలం అయ్యారు కూడా. సౌత్‌తో పోలిస్తే.. నార్త్‌లో సలార్‌కు ఎక్కువ క్రేజ్‌ ఉన్నా.. థియేటర్లు ఎక్కువగా దొరకలేదు.

అయినప్పటికీ సలార్‌ వసూళ్లను ఆపడం డంకీ తరం కాలేదు. విడుదలైన మొదటి రోజు సలార్‌ ఏకంగా 178 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అయితే, హిందీలో మాత్రం కాస్త వసూళ్లు తగ్గాయి. సలార్‌ మూడు రోజుల్లో ఏకంగా 375 కోట్ల రూపాయల వసూళ్లు సాధించగా.. డంకీ మాత్రం 215 కోట్లకే పరిమితం అయింది. వసూళ్ల విషయంలో టాలీవుడ్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ అంటూ ఇంత పెద్ద రచ్చ నడుస్తున్న ఈ సమయంలో యానిమల్‌ చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ సోదరుడు ప్రణయ్‌ రెడ్డి వంగ చేసిన కొన్ని వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.

ఆయన తాజాగా ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యానిమల్‌ కలెక్షన్ల గురించి మాట్లాడుతూ “కార్పోరేట్‌ బుకింగ్‌” గురించి ప్రస్తావించారు. యానిమల్‌ మూవీ ఇప్పటి వరకు 870 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందన్నారు. బాలీవుడ్‌లో ఉండే కార్పోరేట్‌ బుకింగ్‌ ట్రెండ్‌ను తాము ఫాలో కాలేదని చెప్పారు. యానిమల్‌ కలెక్షన్లు కచ్చితమైనవని స్పష్టం చేశారు. ప్రణయ్‌ కార్పోరేట్‌ బుకింగ్స్‌ గురించి మాట్లాడటంతో ఆ బుకింగ్స్‌ వెనుక నడుస్తున్న మాఫియాను వెలుగులోకి తెచ్చినట్లు అయింది.

ఇంతకీ కార్పోరేట్‌ బుకింగ్‌ అంటే ఏంటి?…

స్టార్‌ హీరోల సినిమా విడుదలకు సిద్ధం అయినప్పుడు క్రేజ్‌ ఉండటం పరిపాటి. ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుల్లో చాలా మంది మొదటి రోజు మూవీ చూడ్డానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. బుకింగ్స్‌ అందుబాటులోకి రాగానే ఎగబడి కొనేస్తుంటారు.  ఇదంతా ఒక ఎత్తయితే.. కొన్ని కార్పోరేట్‌ కంపెనీలు కూడా తమ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో సినిమా టికెట్లు కొంటూ ఉంటాయి. సంస్థ స్థాయిని బట్టి టికెట్లు బుక్‌ చేసుకుంటూ ఉంటాయి. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు వాటికి కానుకగా ఇస్తూ ఉంటాయి. దీన్నే కార్పోరేట్‌ బుకింగ్‌ అంటారు.

బాలీవుడ్‌లో  కార్పోరేట్‌ బుకింగ్‌ మాఫియా !

కార్పోరేట్‌ బుకింగ్‌ బాలీవుడ్‌లో పెద్ద మాఫియాగా మారిపోయింది. బాలీవుడ్‌ ఖాన్‌ త్రయంతో పాటు మరికొంత మంది కలెక్షన్ల కోసం కార్పోరేట్‌ బుకింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. సినిమా విడుదల సమయంలో కొన్ని కంపెనీల నుంచి వీరే పెద్ద మొత్తంలో టికెట్లు కొంటారు. సాధారణంగా అయితే, ఆయా కంపెనీలు డిస్కౌంట్‌ రేటుకు టికెట్లు తీసుకుంటూ ఉంటాయి. కానీ, ఇక్కడ మాత్రం సాధారణ టికెట్‌ ధర కంటే.. ఎక్కువ మొత్తం డబ్బులు ఇచ్చి టికెట్లను కొంటున్నారు. ఒక్కో టికెట్‌ ధర మార్కెట్‌లో 100 రూపాయలు ఉంటే.. వీళ్లు 1000 రూపాయలు ఇచ్చి టికెట్‌ కొంటున్నారు.

దీని కారణంగా కలెక్షన్లు పెరిగిపోతున్నాయి. బాలీవుడ్‌లో సూపర్‌ స్టార్లుగా వెలుగొందుతున్న చాలా మంది ఈ ప్రాసెస్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఒకరకంగా దొంగ కలెక్షన్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ మాఫియా కారణంగా బాలీవుడ్‌లోని స్టార్‌ నిర్మాతలు, హీరోలు చాలా రకాలుగా లాభపడుతున్నారు. కొన్ని సార్లు స్పెషల్‌ టికెట్లు కూడా అందుబాటులోకి వస్తూ ఉంటాయి. ఇవి సాధారణ టికెట్‌ కంటే.. భారీ ధర ఉంటాయి. మార్కెట్‌లో 200 ఉన్న టికెట్‌ ధర ‘స్పెషల్‌’ టికెట్ల విషయంలో 20000 వేలు ఉంటుంది.

ఇలా వంద టికెట్లు అమ్మితే చాలు ఒక థియేటర్‌ నుంచే ఏకంగా 20000 లక్షల వసూళ్లు వచ్చి పడతాయి. బాలీవుడ్‌లో అట్లర్‌ ప్లాప్‌ అయిన స్టార్ల సినిమాలు భారీ కలెక్షన్లు కొల్లగొట్టడం వెనుక రహస్యం ఇదేనని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ నెటిజన్‌ జవాన్‌ విడుదల సమయంలో షారుఖ్‌ ఖాన్‌ను ఇదే ప్రశ్న సంధించాడు. దీంతో షారుఖ్‌ ఖాన్‌ సీరియస్‌ అయ్యాడు. చెత్త వాగుడు వాగొందంటూ ఇన్‌డైరెక్ట్‌గా మండిపడ్డారు. నిజానికి కార్పొరేట్ బుకింగ్స్ ద్వారా బాగా లాభపడ్డ హీరో అంటే..

ముందుగా అందరి చూపులు ముందుగా షారూక్ ఖాన్ వైపే మల్లుతాయి. ఎందుకంటే షారూక్ మూవీకి కార్పొరేట్ బుకింగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. బీ-టౌన్ లో షారూక్ క్రేజ్ కి ఇది నిదర్శనంగా ఒక వర్గం చెప్తూ ఉంటుంది. కానీ.., గ్రౌండ్ లెవల్ రియాలిటీ వేరు అన్నది మరో వర్గం వాదన. అయితే.. డంకీకి కూడా కార్పొరేట్ బుకింగ్ ఒక రేంజ్ లో జరిగింది. ఒకవేళ వీటిని తీసేసి చూస్తే.. సలార్ బాలీవుడ్ లో కూడా డంకీని దాటేసినట్టే అన్న వాదన వినిపిస్తోంది.

ఏదేమైనా సందీప్ రెడ్డి వంగ, అతని అన్నయ్య ప్రణయ్ రెడ్డి యానిమల్ కోసం బీ-టౌన్ లో చాలా ఇబ్బందులు ఎదర్కోవాల్సి వచ్చింది. ప్రభాస్ అంతటి స్టార్ కూడా అక్కడి థియేటర్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితిని నెలకొల్పారు. ఇన్ని ఆరోపణలకి తోడు.. ఇప్పుడు కార్పొరేట్ బుకింగ్ మాఫియాపై కూడా చర్చ రావడంతో.. బీ-టౌన్ సో కాల్డ్ స్టార్ స్టార్స్ కి దక్కుతోచడం లేదట. ఇన్నాళ్లు అక్కడ మౌనంగా ఉండిపోయిన లోకల్స్ కూడా ఇప్పుడు మన తెలుగువారితో చేతులు కలుపుతున్నారు. మరి.. ఈ కార్పొరేట్ బుకింగ్ మాఫియా ఆగడాలఫై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.