iDreamPost
android-app
ios-app

వీడియో: క్యాన్సర్‌ తో పోరాటానికి సిద్ధమైన హీరోయిన్.. గుండు చేయించుకుని..!

  • Published Aug 03, 2024 | 4:10 AM Updated Updated Aug 03, 2024 | 4:10 AM

గత కొన్నిరోజులుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాలీవుడ్ బుల్లితెర నటి తాజాగా తన ట్రీట్ మెంట్ లో భాగంగా ఓ ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత కొన్నిరోజులుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాలీవుడ్ బుల్లితెర నటి తాజాగా తన ట్రీట్ మెంట్ లో భాగంగా ఓ ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Aug 03, 2024 | 4:10 AMUpdated Aug 03, 2024 | 4:10 AM
వీడియో: క్యాన్సర్‌ తో పోరాటానికి సిద్ధమైన హీరోయిన్.. గుండు చేయించుకుని..!

బాలీవుడ్ బుల్లితెర హీరోయిన్ హీనఖాన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’తో సీరియల్ తో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచేసింది ఈ బుల్లితెర నటి. అయితే గత కొన్నిరోజులుగా ఈ బ్యూటీ బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో హీనా క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తుంది. ముఖ్యంగా ఏమాత్రం భయపడకుండా.. మానసికంగా కృంగిపోకుండా ఈ భయంకరమైన వ్యాధికి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది.కాగా, ఈ మధ్యనే ఓ వైపు క్యాన్సర్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటూ.. మరోవైపు షూటింగ్ లకు యాక్టివ్ గా పాల్గొన్న వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ తన ట్రీట్ మెంట్ లో భాగంగా మరో ఆసక్తికర వీడియోను పోస్టు చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే థర్డ్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నని  హీనా ఖాన్ తన అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఈ వ్యాధికి కీమో థెరపీ చేయించుకుంటూ  చికిత్స తీసుకుంటుంది. అయిన సరే రోజు రోజుకి హీనా ఖాన్ ఆరోగ్యం మరీంత క్షీణిస్తుంది. ఇక ఈ చికిత్సలో భాగంగానే హీనా జుట్టు పూర్తిగా రాలిపోతుంది. అయితే ఈ కారణంగానే హీనా ఖాన్ తన తల మొత్తం షేవ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో తాజాగా ఈ బ్యూటీ గుండు చేసుకుంటున్న వీడియో తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. పైగా ఆ వీడియోలో క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న సమయంలో జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.

అయితే రోజు రోజుకి ఈ స మస్య మరీంత ఎక్కువైతుందని, ఎక్కడ చూసిన జుట్టు రాలిపోవడమే కనిపిస్తోందని, ముఖ్యంగా మహిళలకు ఇలా జుట్టు రాలిపోతే మరింత చికాగుగా ఉంటుందని హీనా ఖన్ తెలిపింది. పైగా అందులో భాగంగానే ఇలా జుట్టును వదిలించుకోవడానికి తల మొత్తం గుండు చేసుకుంటనని, అవసరమైనప్పుడు విగ్గు పెట్టుకుంటానని తెలిపింది. అంతేకాకుండా.. శారీరక అనారోగ్యాన్ని ఎదుర్కోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలని ఆమె తెలిపింది.  ఇక ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్, సెలబ్రిటీస్ హీనా త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş