iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో శ్రీదేవి బాటలోనే జాన్వీ కపూర్: బాలీవుడ్ నటుడు

  • Published Aug 01, 2024 | 4:46 PM Updated Updated Aug 01, 2024 | 4:46 PM

Janhvi Kapoor: భారతీయ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి అనూహ్యంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాణిస్తుంది.

Janhvi Kapoor: భారతీయ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి అనూహ్యంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాణిస్తుంది.

  • Published Aug 01, 2024 | 4:46 PMUpdated Aug 01, 2024 | 4:46 PM
ఆ విషయంలో శ్రీదేవి బాటలోనే జాన్వీ కపూర్: బాలీవుడ్ నటుడు

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది బాలనటులుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత కాలంలో హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో అతిలోక సుందరి శ్రీదేవి ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన  స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్‌గా మారారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా నెంబర్ వన్ హీరోయిన్‌గా సత్తా చాటారు. బాలీవుడ్ స్టార్ నిర్మాత బోనీకపూర్‌ని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడింది. ఈ జంటకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు జన్మించారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్ గురించి ప్రముఖ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘ఉలఝ్‌’ మూవీలో నటించింది. జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా దర్శకత్వం వహించారు.   ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నటుడు ఆదిల్ హుస్సేన్.. జాన్వీ కపూర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిల్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించిన శ్రీదేవి చాలా కాలం గ్యాప్ తీసుకొని ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ మూవీలో నటించింది. ఆ మూవీలో నేను నటించాను. ఆ సినిమా సెట్స్ లో తొలిసారిగా జాన్వీ కపూర్ ని చూశాను. చిన్నప్పటి నుంచి ఆమె తల్లి శ్రీదేవి యాక్టింగ్ ని బాగా గమనిస్తూ వచ్చేది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె హీరోయిన్ గా నటిస్తున్న ‘ఉలఝ్’ మూవీలో నటించాను. వృత్తి పట్ల శ్రీదేవికి ఎంత గొప్ప డెడికేషన్ ఉందో.. అదే ఏకాగ్రత, అంకితభావం జాన్వీలో చూస్తున్నా.. దర్శకుడు చెప్పిన విధంగా హావభావాలు పలికించడం.. ప్రతిసారి సీన్స్ గురించి అడిగి తెలుసుకోవడం, సెట్ లో అందరినీ గౌరవించడం, టైమింగ్ పాటించడం ప్రతి విషయంలో జాన్వీని చూస్తుంటే ఆమె తల్లిని చూసినట్లే అనిపిస్తుంది’ అని అన్నారు.

ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 2) గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.  జంగ్లీ పిక్చర్స్ పతాకంపై వినీత్ జైన్ నిర్మించిన సుదాన్షు సరియా దర్శకత్వంలో వస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రం ‘ ‘ఉలఝ్‌’. ఈ మూవీ‌లో అందాల తార జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేష్ తైలాంగ్, ఆదిల్ హుస్సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ దేశ భక్తుల వారసత్వాన్ని కలిగి ఉన్న ఓ యువ ఐఎఫ్ఎస్ అధికారి పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి శాశ్వత్ సచ్దేవ్ సంగీతం అందించారు. ఉలాజ్ చిత్రంపై జాన్వీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş