iDreamPost
android-app
ios-app

దేవరలో ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్.. ఇద్దరా? ముగ్గురా? నిజం అయితే పూనకాలే

  • Published Sep 18, 2024 | 1:29 PM Updated Updated Sep 18, 2024 | 1:29 PM

Jr NTR Triple Role In Devara :భారీ అంచనాల మధ్యన రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

Jr NTR Triple Role In Devara :భారీ అంచనాల మధ్యన రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Sep 18, 2024 | 1:29 PMUpdated Sep 18, 2024 | 1:29 PM
దేవరలో ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్.. ఇద్దరా? ముగ్గురా? నిజం అయితే పూనకాలే

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 27 వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆరేళ్ళ తర్వాత తారక్ సోలో ఎంట్రీ అంటే ఆ మాత్రం హైప్ ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర మూవీ రెండు పార్ట్శ్ గా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మొదటి పార్ట్ ను రిలీజ్ చేయనున్నారు. మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ట్రైలర్ రిలీజ్ వరకు వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా..తారక్ అభిమానులకు ప్రత్యేకంగానే నిలిచింది. మొదట్లో ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ.. మెల్లగా మంచి రీచ్ నే దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ మూవీలో తారక్ డ్యూయల్ క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టాక్ ఏంటంటే తారక్ ఈ మూవీలో ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నారట. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దేవర మూవీ అసలు కథ ఏమై ఉంటుందో తెలియదు. కానీ.. ఈ మూవీలో మాత్రం తారక్ డ్యూయల్ రోల్ లో నటించారన్న సంగతి మాత్రం అందరికి అర్థమైంది. దీనితో తారక్ ఏ రోల్స్ లో నటించారు.. ఏ రోల్ బావుంటుంది అనే డిస్కషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. తారక్ డ్యూయల్ రోల్ కాదు.ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నారంటూ టాక్ నడుస్తుంది. ట్రైలర్ లో అయితే తండ్రి కొడుకుల క్యారెక్టర్స్ చేసినట్లుగా చూపించారు కానీ.. అసలు ట్విస్ట్ ప్రీ క్లైమాక్స్ లోనే రివీల్ కానుందట. మూవీలోని బిగ్గెస్ట్ ట్విస్ట్ అదే అంటూ.. ప్రీ క్లైమాక్స్ లో తారక్ మరొక క్యారెక్టర్ ను కూడా చూపించబోతున్నట్లు భారీగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఒకవేళ అదే కనుక నిజం అయితే.. తారక్ చెప్పినట్లుగానే సినిమా ఆఖరి 40 నిముషాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పటివరకు దేవర సినిమా గురించి విన్న వార్తలన్నీ ఒకెత్తయితే.. సినిమాలోని ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మరొక ఎత్తని చెప్పి తీరాల్సిందే.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు. ఈ న్యూస్ విన్న తర్వాత అభిమానులలో దేవర సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సెప్టెంబర్ 27 న మ్యాన్ ఆఫ్ ది మాసెస్ నట విశ్వ రూపం చూస్తే.. ప్రేక్షకులలో పూనకాలు రావాల్సిందే. ఆ రేంజ్ లో సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు సినిమా అసలు కథ తెలుసుకోవడం, కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టడం మాత్రమే బ్యాలన్స్.  ఇక మూవీ రిలీజ్ కు కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మూవీ టీమ్. హైదరాబాద్ నోవొటెల్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ప్రస్తుతం వినిపిస్తున్నతారక్ ట్రిపుల్ రోల్ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş