iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో రిలీజ్! అబ్బో ఈసారి ట్యాగ్ లైన్ అదిరింది!

  • Published Aug 02, 2024 | 5:55 PM Updated Updated Aug 02, 2024 | 6:04 PM

Bigg Boss Telugu Season 8 New Promo Released: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించి ప్రోమోని విడుదల చేశారు. ఈసారి షో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ప్రోమోలో కొన్ని హింట్స్ కూడా ఇచ్చేశారు.

Bigg Boss Telugu Season 8 New Promo Released: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించి ప్రోమోని విడుదల చేశారు. ఈసారి షో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ప్రోమోలో కొన్ని హింట్స్ కూడా ఇచ్చేశారు.

  • Published Aug 02, 2024 | 5:55 PMUpdated Aug 02, 2024 | 6:04 PM
బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో రిలీజ్! అబ్బో ఈసారి ట్యాగ్ లైన్ అదిరింది!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు నెట్టింట లీకులతో సంబర పడిపోతున్న ప్రేక్షకుల కోసం ఇంక అధికారిక అప్ డేట్లు స్టార్ట్ అయిపోయాయి. ఇటీవలే కింగ్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు ప్రోమో షూట్స్ లో పాల్గొన్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ, సడెన్ గా ప్రోమో రిలీజ్ చేసి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. అప్పుడే ప్రోమో వచ్చింది అంటే.. ఇంక తొందర్లోనే సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది అని చెప్పకనే చెప్పేశారు. అలాగే ఈ సారి సీజన్ కి సంబంధించి కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు.

ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున అనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే బిగ్ బాస్ లోగోని ఆవిష్కరించి ఆ విషయాన్ని కన్ఫామ్ చేశారు. ఇప్పుడు ప్రోమోని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. సాధారణంగా ప్రతి సీజన్ కు ఒక థీమ్ తో వస్తూ ఉంటారు బిగ్ బాస్ నిర్వాహకులు. అలాగే ఇప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ ని ఫిక్స్ చేసుకున్నారు అనే విషయం అయితే అర్థమైపోతోంది. ముందుగా ప్రోమో గురించి మాట్లాడుకుంటే.. ప్రముఖ తెలుగు కమెడియన్ సత్యతో ఈ ప్రోమోని స్టార్ట్ చేశారు. సత్య ఒక దొంగ. అతను ఒక వింటేజ్ వస్తువులు ఉండే దుకాణంలోకి వెళ్తాడు. అక్కడ దీపంలో ఉండే వరాలు ఇచ్చే కింగ్ గా నాగార్జునను చూపించారు. వరాలు ఇవ్వడంతో పాటుగా.. కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఈసారి లిమిటే లేదు అని.

లాస్ట్ సీజన్లో ఉల్టా పుల్టా అని అందరినీ బాగా ఎంటర్ టైన్ చేశారు. ఈసారి 8వ సీజన్ లోగోని ఇన్ఫినిటీలా పెట్టి ఎంటర్ టైన్మెంట్ కి లిమిట్ లేదు అని చెప్పారు. తాజాగా ‘ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’ అంటూ కింగ్ నాగార్జున డైలాగ్ ఇరగదీశారు. అంటే ఈసారి కాన్సెప్ట్ కూడా అదిరిపోతుంది అని చెప్పకనే చెప్పారు. అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలి అని ఫిక్స్ అయితే ఇంక వచ్చే టాస్కులు, చేసే పోరాటాలకు లిమిట్ లేదు అని కంటెస్టెంట్స్ అనుకోవచ్చు. మీరు ఆడియన్ గా ఒక్కసారి బిగ్ బాస్ ని చూడటం స్టార్ట్ చేశారు అంటే.. ఇంక ఎంటర్ టైన్మెంట్, ఫన్, కామెడీకి లిమిటే లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా అటు కంటెస్టెంట్స్, ఇటు ఆడియన్స్ కి కలిసివచ్చేలా ఒక క్యాచీ ట్యాగ్ లైన్ తో ఈసారి సీజన్ ప్రారంభించబోతున్నారు. ఈసారి ఎప్పటి లాగానే సెప్టెంబర్ నెలలో సీజన్ ప్రారంభం అవుతుంది అంటున్నారు. ఇది సీజన్ 8 కాబట్టి.. సెప్టెంబర్ 8వ తేదీ ఆదివారం సాయంత్ర 6 గంటల నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది అని లీకులు అయితే వస్తున్నాయి. మరి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom