iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్! నేరం రుజువైతే 7 ఏళ్ళ వరకు శిక్ష..

  • Author ajaykrishna Updated - 10:20 PM, Mon - 23 October 23

కొన్నిసార్లు బిగ్ బాస్ లో కూడా ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి ఆశ్చర్యం కలిగించడం కాదు.. షాక్ కు గురి చేస్తాయి. ఇటీవల కన్నడ బిగ్ బాస్ షోలో అలాంటి ఘటనే జరిగింది. దీంతో ఒక్కసారిగా బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా షాక్ కి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

కొన్నిసార్లు బిగ్ బాస్ లో కూడా ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి ఆశ్చర్యం కలిగించడం కాదు.. షాక్ కు గురి చేస్తాయి. ఇటీవల కన్నడ బిగ్ బాస్ షోలో అలాంటి ఘటనే జరిగింది. దీంతో ఒక్కసారిగా బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా షాక్ కి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Author ajaykrishna Updated - 10:20 PM, Mon - 23 October 23
బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్! నేరం రుజువైతే 7 ఏళ్ళ వరకు శిక్ష..

బిగ్గెస్ట్ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్.. ఇండియాలో ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. మొదట హిందీలో మొదలైన ఈ షో.. మెల్లగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషలలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగులో 7వ సీజన్ జరుగుతుండగా.. హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహారిస్తున్నారు. మరోవైపు తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్.. కన్నడలో కిచ్చా సుదీప్ హోస్ట్ గా ఉన్నారు. ఇప్పటికైతే ఏ భాషలో ఆ భాషకు బిగ్ బాస్ గట్టిగానే ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాయి. రోజురోజుకి ఊహించని విధంగా ఆసక్తి రేపుతున్నాయి.

కొన్నిసార్లు బిగ్ బాస్ లో కూడా ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి ఆశ్చర్యం కలిగించడం కాదు.. షాక్ కు గురి చేస్తాయి. ఇటీవల కన్నడ బిగ్ బాస్ షోలో అలాంటి ఘటనే జరిగింది. దీంతో ఒక్కసారిగా బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా షాక్ కి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కన్నడలో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 10 నడుస్తుంది. ఈసారి షోలో అఖిల భారత గోసంరక్షణ కమిటీ అధ్యక్షుడిగా వర్క్ చేసిన వర్తూరు సంతోష్ పాల్గొన్నాడు. ఇతనికి కర్ణాటకలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్టోబర్ 8న కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న సంతోష్ ని.. తాజాగా అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అందుకు కారణం.. సంతోష్ మెడలో ఉన్న పులి పంజా లాకెట్.

ఆ వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ షోలో వర్తూరు సంతోష్ పులి పంజా లాకెట్ ధరించి కనిపించాడు. దీంతో అటవీ శాఖ అధికారులు బిగ్ బాస్ సెట్స్ కి చేరుకొని.. లాకెట్ ని పరిశీలించారు. అనంతరం దానిపై దర్యాప్తు చేయగా.. అది ఒరిజినల్ పులిదేనని కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో అధికారులు సంతోష్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లాకెట్ కి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు దాన్ని.. ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఈ ఘటనపై డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవీంద్ర కుమార్ స్పందిస్తూ.. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ని సంతోష్ ఉల్లంఘించాడని.. నేరం రుజువైతే 3 – 7 శిక్షపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కర్ణాటకలో సంచలనం రేపుతోంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.