iDreamPost
android-app
ios-app

నా సినిమా చూడండి అంటూ మోకాళ్లపై కూర్చుని అర్ధించిన సోహైల్!

  • Published Jan 30, 2024 | 1:54 PM Updated Updated Jan 30, 2024 | 2:06 PM

Syed Sohel: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ త్వరలో బూట్ కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో సోహెల్ చాలా ఎమోషనలయ్యాడు. తన సినిమాను చూడండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.

Syed Sohel: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ త్వరలో బూట్ కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో సోహెల్ చాలా ఎమోషనలయ్యాడు. తన సినిమాను చూడండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.

  • Published Jan 30, 2024 | 1:54 PMUpdated Jan 30, 2024 | 2:06 PM
నా సినిమా చూడండి అంటూ మోకాళ్లపై  కూర్చుని అర్ధించిన సోహైల్!

వ్యాపారంలో ఒక వస్తువును తయారు చేయడం కంటే దానిని మార్కెట్ లోకి తీసుకెళ్లడం చాలా కష్టం. ఎందుకంటే..తయారు చేసిన అంతా ఈజీగా జనాలు ఆదరించరు. అందుకే జనాల్లోకి వెళ్లేందుకు వస్తువు గురించి ఫుల్ గా ప్రమోషన్ చేయాలి. అందుకోసం భారీగా ధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం వస్తువులకే కాదు.. సినిమాలకి కూడా వర్తిస్తుంది. అందుకే చాలా సినిమాలు ప్రమోషన్స్ లేక ఆశించిన ఫలితాలను పొందలేదు. ఈక్రమంలో కొందరు అయితే తమ సినిమాను ఏదో విధంగా ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. చేతిలో డబ్బుల్లు లేకపోయిన తమ ఆవేదనను ఆడియన్స్ కి చెప్పుకుని సినిమా చూడమని అభ్యర్థిస్తుంటారు. తాజాగా ఓ హీరోగా కూడా తన సినిమా ప్రమోషన్ విషయంలో ఎమోషనలయ్యాడు.

సోహెల్.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన వారిలో సోహెల్ ఒక్కరు. బిగ్ బాస్ షో లోకి వెళ్లి..తనదైన ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన తరువాత వెండితెరపై కూడా వెలిగారు. ఇటీవలే ‘మిస్టర్ ప్రగ్నెట్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఆ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఇక ఆ సినిమాలో సోహెల్ నటనకు ఆడియన్స్ మంచి మార్కులే ఇచ్చారు. త్వరలో బూట్ కట్ బాలరాజు సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నాడు.

ఫిబ్రవరి 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో సోహెల్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే సుమ అడ్డాలో పాల్గొన్న సోహెల్ తన సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు. తన దగ్గర డబ్బులు లేవని, సుమ అక్కడ ఫ్రీగానే ఫ్రీ రిలీజ్ ఈ వెంట్ చేసేందుకు ఒప్పుకున్నారని సోహెల్ చెప్పుకొచ్చాడు. అంతేకాక సుమ అక్కకు జీవితాంతం రుణపడి ఉంటానంటూ సోహెల్ ఎమోషనలయ్యారు. తాజాగా మరో వేదికపై నుంచి తన సినిమా చూడండి అంటూ మోకాళ్లపై కూర్చుని సోహెల్ అర్థించాడు.

సోమవారం సాయంత్రం సోహెల్ నటించిన బూట్‌కట్ బాలరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు బ్రహ్మానందం, సందీప్ కిషన్, సాయి రాజేష్.. పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ సినిమా గురించి సోహెల్ అనేక విషయాలను నుంచి షేర్ చేసుకున్నారు. అలానే ఈ ఈవెంట్ లో  సోహెల్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. “ మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు, నేను సంపాదించి.. ఇల్లు కొనుక్కుందామని ఉంచుకున్నవి, అన్ని డబ్బులు ఈ సినిమాకు పెట్టాను. సినిమా కోసం అందరూ కష్టపడతారు. సినీ ఇండస్ట్రీలో నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. కొంతమంది ప్రోత్సహించలేదు. హీరోగా పనిచేయను, నిలబడను” అని సోహెల్ చెప్పుకొచ్చారు.

ఇంకా సోహెల్ మాట్లాడుతూ..”సినీ పరిశ్రమలో సపోర్ట్ ఉంటేనే నిలబడతాం. నేను సినిమాల్లోకి వస్తే అమ్మానాన్న కష్టాలు ఉన్నా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఎంత కష్టపడ్డా ఇంకా పోరాటం చేస్తాను. లైఫ్ క్లోజ్ చేసుకుందాం అని ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ మన కోసం ఉన్న తల్లిదండ్రుల కోసం  మనం బతకాలి” అంటూ సోహెల్ తన సినిమా కష్టాలు చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఇక చివరగా స్టేజిపై మోకాళ్ల మీద కూర్చిని  సోహెల్ అందిరకి దండం పెట్టాడు.

అలా  దండం పెడుతూ.. “ఇంతకంటే నేను ఏం చేయలేను, చెప్పలేను. నా సినిమాను ప్రమోషన్  చేసేందుకు డబ్బులు లేవు. నా సినిమా తప్పకుండా చూడండి. నేను పడిన కష్టాలు అన్ని చెప్పినా. ఇంతే.. నా సినిమా బూట్ కట్ బాలరాజు ఫిబ్రవరి 2న చూడండి” అంటూ సోహెల్ ఏడ్చేశాడు. ప్రస్తుతం సోహెల్ స్పీచ్ సోషల్ మీడియలో వైరల్ గా మారింది. మరి.. సోహెల్ వీడియోపై మీ  అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet