iDreamPost
android-app
ios-app

హజీపూర్‌ హత్యలను గుర్తు చేస్తోన్న తెప్ప సముద్రం.. ఇంతకీ ఆ రాక్షసుడు ఎవరు?

  • Published Mar 09, 2024 | 3:03 PM Updated Updated Mar 09, 2024 | 3:03 PM

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, హీరో చైతన్యరావు హీరోలుగా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం తెప్ప సముద్రం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడదలైంది.

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, హీరో చైతన్యరావు హీరోలుగా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం తెప్ప సముద్రం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడదలైంది.

  • Published Mar 09, 2024 | 3:03 PMUpdated Mar 09, 2024 | 3:03 PM
హజీపూర్‌ హత్యలను గుర్తు చేస్తోన్న తెప్ప సముద్రం.. ఇంతకీ ఆ రాక్షసుడు ఎవరు?

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యి వారిని అలరించిన ఎంతో మంది యాక్టర్స్ ఇప్పుడు వెండితెరపై దర్శనం ఇస్తున్నారు. మొదటగా వీరు చిన్న చిన్న పాత్రలతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇస్తూ.. ఆ తర్వాత ప్రధాన పాత్రల్లో సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్నారు. ఇటీవలే చాలామంది నటి, నటులు సినీ పరిశ్రమల్లో హీరో, హీరోయిన్ లుగా కొనసాగుతూ తమ సత్తాను చాటుతున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఫెమ్ ‘అర్జున్ అంబటి’, షార్ట్ ఫిలిమ్స్ హీరో ‘చైతన్యరావు’ ప్రధాన పాత్రల్లో ఓ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు. అయితే, వీరిద్దరూ తాజాగా నటించిన ఆ చిత్రం ‘తెప్ప సముద్రం’. కాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఆ టీజర్ ఎలా ఉందంటే..

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, హీరో చైతన్యరావు హీరోలుగా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘తెప్ప సముద్రం’. అయితే ఈ సినిమాను సతీష్ రాపోలు దర్శకత్వ వహించగా.. ఇందులో కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే, ఈ సినిమాను నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ నిర్మిస్తున్నారు. కాగా, తెప్ప సముద్రం సినిమాకు సంబంధించిన టీజర్ ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న.. హీరో అల్లరి నరేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది.ఇక తెప్ప సముద్రం సినిమా టీజర్ ను చూస్తే.. అమ్మాయిల మర్డర్ మిస్టరీ వెనక దాగున్న ఆ రాక్షసుడు ఎవరు అనే కోణంలో సాగింది. దీంతో పాటు ఈ సినిమా ఓ మిస్టగా ఆద్యంతం థ్రిల్లింగ్ ను పంచేలా మన ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా.. 2015 లో తెలంగాణాలోని హాజీపూర్‌లో సంచలన సృష్టించిన బావిలో స్కూల్ పిల్లల హత్యలు సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉంటుంది.

అయితే, తెప్ప సముద్రం సినిమా పై మరింత క్లారిటీ రావాలంటే.. ఈ సినిమా ట్రైలర్ విడుదలయినంత వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఈ సినిమాను టీజర్ ను రిలీజ్ చేసిన అల్లరి నరేష్ మాట్లాడుతూ.. తెప్ప సముద్రం టీజర్ చూడగానే ఒక మంచి థ్రిల్లర్ ఫీల్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాను అందరూ ఆదరించి పెద్ద హిట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు. ఇక తెప్ప సముద్రం సినిమాకు పి. ఆర్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఓ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాకు ఆఫ్ ఫోటోగ్రఫీ గా శేఖర్ పోచంపల్లి డైరెక్టర్ చేశారు. అలానే ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన థీయేటర్లలో రిలీజ్ కానుంది. మరి, తెప్ప సముద్రం టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş