iDreamPost

మాట నిలబెట్టుకున్న రైతు బిడ్డ.. వారికి భారీ సాయం

  • Published Mar 15, 2024 | 10:33 AMUpdated Mar 15, 2024 | 10:33 AM

Pallavi Prasanth: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్‌ అయిన తర్వాత ఓ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రశాంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. దీంతో అతను చేసిన పనికి అభిమానుల వద్ద ప్రశంసలు అందుకున్నాడు.

Pallavi Prasanth: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్‌ అయిన తర్వాత ఓ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రశాంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. దీంతో అతను చేసిన పనికి అభిమానుల వద్ద ప్రశంసలు అందుకున్నాడు.

  • Published Mar 15, 2024 | 10:33 AMUpdated Mar 15, 2024 | 10:33 AM
మాట నిలబెట్టుకున్న రైతు బిడ్డ.. వారికి భారీ సాయం

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ షో ద్వారా రైతు బిడ్డగా అందరి ఆదరణలు దక్కించుకున్నాడు. కాగా, ఈ షో పుణ్యమా అంటూ ఇతడు ఒక్కసారిగా సెలబ్రిటీగా కూడా మారిపోయాడు. దీంతో ఎక్కడ చూసిన తరుచు పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు తరుచు సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉన్నాయి. కేవలం ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హోస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట, మాట తీరుతో చాలా మంది మనసులను గెల్చుకున్నాడు. ఇక విన్నర్ గా నిలిచిన తర్వాత.. ఆయన అనుకోని సంఘటనలతో అరెస్టు కావడవ, జైలుకు వెళ్లడం, ఆ తర్వాత విడుదల కావడం అంతా జరిగిపోయినా విషయమే. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్.. ఓ మాట ఇచ్చిన సంగతి అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. మరోసారి పల్లవి ప్రశాంత్ చేసిన పనికి అతని అభిమానులు ప్రశంసలతో ముంచేత్తుతున్నారు.

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్‌ అయిన తర్వాత .. బిగ్‌బాస్‌ నుంచి వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచుతాను.. నాకు వచ్చిన రూ. 35 లక్షల్లో నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను, మొత్తం డబ్బును రైతులకే పంచేస్తా అంటూ స్టేజ్ మీద ప్రశాంత్ మాట ఇచ్చాడు. అయితే ఆ తర్వాత.. ప్రశాంత్ పై పోలీస్ కేసు అవ్వడం, అతడు జైలుకి వెళ్లడం ఇలా అనుకోని ఘటనలు జరిగాయి. అలాగే మరోవైపు ఇచ్చిన మాట ప్రకారం ప్రశాంత్ రైతులకి డబ్బులు ఇవ్వడం లేదని చాలా మంది నెటిజన్లు అతడిని టార్గెట్ చేస్తూ కామెంట్లు కూడా పెట్టారు. వీటన్నింటికీ తాజాగా ప్రశాంత్ తన చేతలతో సమాధానం చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకి తొలి సాయాన్ని అందజేశానంటూ గర్వంగా చెప్పుకొచ్చాడు.

అయితే అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా పల్లవి ప్రశాంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో శివాజీ, భోలే షావలి, ఆట సందీప్ కూడా ఉన్నారు. ఇక శివాజీ చేతుల మీదుగా ఓ రైతు కుటుంబానికి రూ. లక్ష ఇప్పించాడు ప్రశాంత్. అలానే ఒక సంవత్సరానికి సరిపడా బియ్యం కూడా అందజేశాడు. ఇదే విషయాన్ని పోస్ట్ చేస్తూ ‘ప్రాణం పోయినా మాట తప్పను.. మీకు ఇచ్చిన మాట కోసం ముందుగా చేసిన సహాయం” అంటూ రైతు బిడ్డ చెప్పాడు. మీ ప్రోత్సాహంతో మరింత మందికి సాయం చేస్తాను’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే ఇదే పోస్టులో సందీప్ మాస్టర్ రూ. 25 వేలు సాయం చేశారంటూ ప్రశాంత్ తెలిపాడు. ఇక ఈ వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. ఈ డబ్బును మీ పిల్లల పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తారు.. అది వాళ్ల పెళ్లి సమయానికి ఉపయోగపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు విమర్శించిన నోటితోనే రైతుబిడ్డను ప్రశంసిస్తున్నారు. కాస్త అలస్యం అయినా మంచి పని చేశాం, నువ్వు చాలా మంచోడివి అన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే మిగిలిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకి ఇచ్చెయ్ అన్నా అంటూ గుర్తు చేస్తున్నారు. ఇక సందీప్ మాస్టర్ చేసిన సాయంపైనా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి మాట ఇవ్వకపోయినా తోచినంత సాయం చేసిన సందీప్ మాస్టర్‌‌ని అభినందిస్తున్నారు. ఇక ఈ వీడియో కింద బిగ్‌బాస్ ఫేమ్ ఆది రెడ్డి కూడా రియాక్ట్ అయ్యాడు. ఒకరోజు మీతో పాటు నేను కూడా వస్తా.. నాకు తోచినంత సాయం చేస్తానంటూ కామెంట్ పెట్టాడు.మరి, పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాటాను నిలబెట్టుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి