iDreamPost
android-app
ios-app

ఇంటర్వ్యూ పేరుతో యువనటిపై అత్యాచారం.. హోటల్ కి పిలిచి!

  • Author ajaykrishna Published - 12:22 PM, Fri - 21 July 23
  • Author ajaykrishna Published - 12:22 PM, Fri - 21 July 23
ఇంటర్వ్యూ పేరుతో యువనటిపై అత్యాచారం.. హోటల్ కి పిలిచి!

సమాజంలో ఎన్ని సంఘటనలు జరుగుతున్నా.. రోజురోజుకి సంఖ్య పెరుగుతూ పోతోంది తప్ప తగ్గడం లేదు. ఇలాంటి అమానుష సంఘటనలు సాధారణ జనాలకు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీల విషయంలోను జరుగుతున్నాయి. ఇటీవల ఓ యువనటికి సినిమా అవకాశం ఇప్పిస్తానని చెప్పి.. నమ్మి వెళితే స్వయంగా స్నేహితుడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన.. గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ పేరుతో 24 ఏళ్ళ యువనటిని ఓ హోటల్ కి పిలిచి.. ఇంటర్వ్యూ అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడి పైగా ఈ విషయం బయటికి చెబితే.. ఆమెకు సంబంధించిన వీడియోస్, ప్రైవేట్ ఫోటోలు ఆన్ లైన్ లో లీక్ చేస్తామని బెదిరించాడు ఆ దుర్మార్గుడు.

ఇంతకీ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో ఆ యువనటికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ.. యాక్టీవ్ గా ఉంటోంది. ఈ క్రమంలో ఆ యువతికి ఇన్ స్టాగ్రామ్ లోనే మహేష్ పాండే అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను రెగ్యులర్ గా ఆమెతో టచ్ లో ఉంటూ పరిచయస్తుడు కాస్త స్నేహితుడుగా మారాడు. కొద్దిరోజులకు ఆ యువనటికి భోజ్ పురి సినిమాలలో అవకాశం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. అలా జూన్ 29న గురుగ్రామ్ లో ఇంటర్వ్యూ ఉందని.. ఓ హోటల్ కి ఆమెను రమ్మన్నాడు. సరే స్నేహితుడు కదా.. నిజమే అనుకోని ఆ యువనటి ఆ హోటల్ కి వెళ్ళింది.

కట్ చేస్తే.. ఆ యువనటి స్నేహితుడు మహేష్ పాండే చేతిలోనే అత్యాచారానికి గురైంది. దీంతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఇక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇలా పేర్కొంది. మహేష్ పాండే ముందే హోటల్ లో ఇంటర్వ్యూ అని చెప్పి ఓ రూమ్ బుక్ చేశాడు. ఇంటర్వ్యూ తర్వాత అతను మద్యం తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ టైమ్ లో నేను వెళ్ళిపోదామని బయలు దేరుతున్నాను. అప్పుడే నన్ను అతను బలవంతంగా అడ్డుకొని.. నాపై లైంగిక దాడి చేశాడు. అంతేగాక ఈ విషయం బయటికి వస్తే.. చంపుతానని, నా ప్రైవేట్ వీడియోని ఆన్ లైన్ లో పెడతానని బెదిరించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్న పోలీసులు.. గురుగ్రామ్ పరిధిలోని చరక్ పూర్ లో నివసించే మహేష్ పాండేపై కేసు నమోదు చేశారు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş