Swetha
మార్చి 8న మహాశివరాత్రి సంధర్బంగా గోపీచంద్ నటించిన భీమా సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి, మూడవ రోజు భీమా మూవీ ఎంత వసూళ్లను రాబట్టిందో చూసేద్దాం.
మార్చి 8న మహాశివరాత్రి సంధర్బంగా గోపీచంద్ నటించిన భీమా సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి, మూడవ రోజు భీమా మూవీ ఎంత వసూళ్లను రాబట్టిందో చూసేద్దాం.
Swetha
గోపిచంద్ నటించిన “భీమా” సినిమాను మార్చి8న గ్రాండ్ గా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ నడుస్తుంది. అదే రోజు విడుదలైన గామి సినిమాకు పోటిగానే నిలుస్తోంది భీమా. భీమా సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్. దానితో పాటు అటు సోషియో ఫాంటసీ టచ్ ను కూడా ఈ సినిమాలో యాడ్ చేశారు. ఇక ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాలో మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్.. హీరోయిన్లుగా నటించారు. కెకె రాధామోహన్ ఈ సినిమాను ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సిమిమా విడుదలైన మొదటి షో నుంచి .. మిక్సడ్ టాక్ తో మొదలయ్యి.. ఫైనల్ గా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మొదటి రెండు రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా రూ.3.94 కోట్ల షేర్ ను రాబట్టింది. మరి, మూడవ రోజు భీమా సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
గోపీచంద్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఒరియెంటెడ్ చిత్రం భీమా. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ నటించాడు. కాగా, ఈ చిత్రం విడుదలకు ముందు రూ.10.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక రెండు రోజులు పూర్తయ్యేసరికి భీమా సినిమా రూ.3.94 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక మూడవ రోజు ఈ సినిమా రూ.1.65 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. అయితే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మాత్రం రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ, గోపీచంద్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది . అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మొదటి రోజు కోటి రూపాయల వరకు వసూళ్లు చేసింది. భీమా సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంటున్న కూడా.. ప్రస్తుతం ఈ సినిమాకు పోటీగా గామి ఉండడంతో.. గోపీచంద్ కు ఈసారి కలెక్షన్స్ విషయంలో కాస్త టఫ్ గా మారిందని చెప్పి తీరాలి. మరి, ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపైనా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేస్తోందో లేదో వేచి చూడాలి.
కాగా, భీమా సినిమా గోపిచంద్ కు కమ్ బ్యాక్ హిట్ మూవీ అంటున్నారు ఆడియన్స్. అంతేకాకుండా భీమా సినిమాలో గోపీచంద్ అదరగొట్టాడని, నటన పరంగా దాదాపుగా క్యారక్టర్ లో జీవించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ రివ్యూస్ ఇస్తున్నారు. కాగా, భీమా సినిమాలో మాళవిక శర్మ, ప్రియా భవానీ
శంకర్ తో పాటు సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, నరేష్ కీలక పాత్రలు పోషించారు. ఇక , భీమా సినిమా రానున్న రోజుల్లో ఎంత కలెక్షన్స్ సంపాదించుకునుందో వేచి చూడాలి. మరి, భీమా సినిమా కలెక్షన్స్ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.