భగవంత్ కేసరి 2 డేస్ కలెక్షన్స్! ఇంకా ఎంత రాబట్టాల్సి ఉందంటే..

  • Author ajaykrishna Updated - 04:27 PM, Sat - 21 October 23

భగవంత్ కేసరి మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అదరగొట్టింది. ఎందుకంటే.. పోటీగా డబ్బింగ్ మూవీ లియో ఒక్కటే ఉంది. ఇక రెండో రోజు విషయానికి వస్తే.. లియోతో పాటు టైగర్ నాగేశ్వరరావు పోటీకి వచ్చేసరికి అందరి దృష్టిని ఆకర్షించలేకపోయింది. బట్.. సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

భగవంత్ కేసరి మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అదరగొట్టింది. ఎందుకంటే.. పోటీగా డబ్బింగ్ మూవీ లియో ఒక్కటే ఉంది. ఇక రెండో రోజు విషయానికి వస్తే.. లియోతో పాటు టైగర్ నాగేశ్వరరావు పోటీకి వచ్చేసరికి అందరి దృష్టిని ఆకర్షించలేకపోయింది. బట్.. సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

  • Author ajaykrishna Updated - 04:27 PM, Sat - 21 October 23

నటసింహం బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ డ్రామా ‘భగవంత్ కేసరి’. శైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలకపాత్రలలో నటించారు. ముందునుండి బాలయ్య ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్లుగానే భగవంత్ కేసరిని అటు మాస్.. ఇటు క్లాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా దర్శకుడు అనిల్ రెడీ చేశాడని ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది. మొత్తానికి భారీ అంచనాల మధ్య భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేకర్స్ ఎక్స్ పెక్ట్ చేసినట్లుగా సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది.

కట్ చేస్తే.. భగవంత్ కేసరి మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అదరగొట్టింది. ఎందుకంటే.. పోటీగా డబ్బింగ్ మూవీ లియో ఒక్కటే ఉంది. ఇక రెండో రోజు విషయానికి వస్తే.. లియోతో పాటు టైగర్ నాగేశ్వరరావు పోటీకి వచ్చేసరికి అందరి దృష్టిని ఆకర్షించలేకపోయింది. బట్.. సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. భగవంత్ కేసరి రెండో రోజు కలెక్షన్స్ మోస్తరుగా నమోదు చేసింది. మొదటి రోజుతో పోల్చుకుంటే తక్కువే అయినా.. ఇంకా దసరా హాలిడేస్ ఉన్నాయి. కాబట్టి.. కవర్ చేసే అవకాశం లేకపోలేదు. మొత్తానికి రెండో రోజు భగవంత్ కేసరి.. పర్వాలేదు అనిపించే విధంగా వరల్డ్ వైడ్ రూ. 5.22 కోట్లు షేర్, రూ. 9.65 కోట్ల వరకు గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

భగవంత్ కేసరి 2 రోజుల కలెక్షన్స్ ఏరియా వైస్:

  • నైజాం: 5.65Cr
  • సీడెడ్: 3.70Cr
  • ఉత్తరాంద్ర: 1.65Cr
  • ఈస్ట్: 1.12Cr
  • వెస్ట్: 1.17Cr
  • గుంటూరు: 3.31Cr
  • కృష్ణా: 97L
  • నెల్లూరు: 84L

AP-TG టోటల్: 18.46 కోట్ల షేర్(29.90 కోట్లు గ్రాస్)

  • కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 1.23 కోట్లు
  • ఓవర్సీస్: 3.80 కోట్లు

వరల్డ్ వైడ్: 23.49 కోట్ల షేర్(40.10 గ్రాస్)

ఇదిలా ఉండగా.. భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద రూ. 68.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిందని తెలుస్తుంది. మొదటి రెండు రోజులు పూర్తి కాగా.. ఇంకా రూ. 45.01 కోట్ల వరకు షేర్ వసూల్ చేయాల్సి ఉంది. మరి ముందు రోజుల్లో భగవంత్ కేసరి ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments