మహర్షి, భగవంత్ కేసరిలో నటించింది.. ఇప్పుడు బండిపై టిఫిన్ అమ్ముకుంటూ..!

మహర్షి, భగవంత్ కేసరిలో నటించింది.. ఇప్పుడు బండిపై టిఫిన్ అమ్ముకుంటూ..!

ఆమె పలు సీరియల్స్, సినిమాలు చేసింది. మహర్షి, భగవంత్ కేసరి, గేమ్ ఛేంజర్ వంటి చిత్రాల్లో కనిపించింది. చిన్న సినిమాల్లో హీరో, హీరోయిన్లకు తల్లిగాను నటించింది. ప్రస్తుతం ఆమె బండిపై టిఫిన్ అమ్ముకుంటూ కనిపించింది.

ఆమె పలు సీరియల్స్, సినిమాలు చేసింది. మహర్షి, భగవంత్ కేసరి, గేమ్ ఛేంజర్ వంటి చిత్రాల్లో కనిపించింది. చిన్న సినిమాల్లో హీరో, హీరోయిన్లకు తల్లిగాను నటించింది. ప్రస్తుతం ఆమె బండిపై టిఫిన్ అమ్ముకుంటూ కనిపించింది.

ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై ఆసక్తికి తోడు.. నటన పట్ల ఉన్న ఇష్టంలో ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. ఎన్నో ఆశలు, ఆశయాలు, కలలతో అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. వెండితెరపై ఛాన్సులు రాకపోవడంతో స్మాల్ స్క్రీన్లపై అడుగు పెడుతుంటారు. చిన్నాచితకా పాత్రలతో మెరుస్తూ ఉంటారు. ఒక్క మంచి ఛాన్స్ రాకపోతుందా అన్న ఆశ వారిని కొన్నాళ్ల పాటు సినీ పరిశ్రమలో కొనసాగేలా చేస్తుంది. అలా చాలని వేతనంతో నెట్టుకు వస్తుంటారు. అయితే ఆర్థిక సమస్యలు వెంటాడటంతో కొంత మంది వెనుదిరుగుతుంటారు. తమ స్వగ్రామంలో ఏదో ఒక పనిచేస్తూ బతుకుతుంటారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ కూడా వెండితెరపై బుల్లితెరపై పలు సీరియల్లో నటించింది. కానీ  ఇప్పుడు ఓ రోడ్డుపై టిఫిన్ బండి పెట్టుకుని  జీవనాన్ని కొనసాగిస్తుంది.

సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి యాంకర్‌గా, పలు సీరియల్లో తల్లిగా నటించిన ఓ నటి.. ఇప్పుడు టిఫిన్ బండిని జీవనాధారం చేసుకుని బతుకుతుంది. ఇంతకు ఆమె ఎవరంటే తాటి గీత. గృహ ప్రవేశం, మనసు మమత, నిన్నే పెళ్లాడతా, గుప్పెడంత మనసు, నాలుగు స్థంబాలాట, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్ చేసింది. మహర్షి, భగవంత్ కేసరి, గేమ్ ఛేంజర్ (వీటిల్లో డైలాగ్స్ లేవు) తమసోమ జ్యోతిర్గమయ, యద్భావం తద్బవతి, బీమ దేవర పల్లి బ్రాంచ్, ప్రేమ విమానం, లగ్గం, ట్రెండింగ్ లవ్ స్టోరీస్ వంటి చిత్రాల్లో చేసింది. హీరో, హీరోయిన్లకు తల్లి క్యారెక్టర్లు చేసింది. తాజాగా గీత బండిపై టిఫిన్ అమ్ముకుంటూ కనిపించగా.. ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ పట్టణానికి చెందిన తాటి గీత.. చిన్నప్పుడు తన సమీపంలో ఉన్న థియేటర్లలో వచ్చే సౌండ్స్ విని సినిమాల్లో నటించాలని అనుకుందట. అయితే అదే సమయంలో టిక్ టాక్, డబ్ స్మాష్ ద్వారా యాక్టింగ్ ప్రాక్టీస్ చేసింది. అలా ఆమె వీడియోలు చూసిన కొందరు..సినిమాల్లో, సీరియల్స్‌లోకి వెళ్లొచ్చు కదా అని ఎంకరేజ్ చేశారు. అయితే కొడుకు పుట్టిన తర్వాత.. కొంత మంది పరిచయాలతో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. అలా ఆ రోజు నుండి ఈరోజు వరకు వెనుతిరుగకుండా టీవీ సీరియల్స్, సినిమాలు చేసింది. తాను ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదన్న ఆమె..తన తల్లిదండ్రులు గతంలో హోటల్ బిజినెస్ చేశారని, ఇప్పుడు తాను టిఫిన్ సెంటర్ నడుపుతున్నట్లు చెప్పింది. ఇప్పుడిప్పుడే తనకు అవకాశాలు వస్తున్నాయని తెలిపింది.

Show comments