iDreamPost
android-app
ios-app

దూకుడు సాంగ్ లోని ఈ బ్యూటీని గుర్తు పట్టారా? మామూలు బ్యాగ్రౌండ్ కాదు..

  • Published Aug 31, 2024 | 11:56 AM Updated Updated Aug 31, 2024 | 11:56 AM

Dookudu: శ్రీనువైట్ల- సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం దూకుడు. సమంత హీరోయిన్. 2011లో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో పాటలు కూడా సూపర్ హిట్. ఇక హీరో ఎలివేషన్ సాంగ్, టైటిల్ ట్రాక్ దూకుడు వెరే లెవల్. ఇందులో నటించిన భామ గుర్దుందా.. ఆమె బ్యాగ్రౌండ్ మామాలుగా లేదు

Dookudu: శ్రీనువైట్ల- సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం దూకుడు. సమంత హీరోయిన్. 2011లో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో పాటలు కూడా సూపర్ హిట్. ఇక హీరో ఎలివేషన్ సాంగ్, టైటిల్ ట్రాక్ దూకుడు వెరే లెవల్. ఇందులో నటించిన భామ గుర్దుందా.. ఆమె బ్యాగ్రౌండ్ మామాలుగా లేదు

  • Published Aug 31, 2024 | 11:56 AMUpdated Aug 31, 2024 | 11:56 AM
దూకుడు సాంగ్ లోని ఈ బ్యూటీని గుర్తు పట్టారా? మామూలు బ్యాగ్రౌండ్ కాదు..

సినిమా సీరియస్ ట్రాక్‌లో ఉన్నప్పుడు ఫన్ మిక్స్ చేయడంలో దిట్ట శ్రీను వైట్ల. ఆయన కామెడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ చిత్రాలు ఈ కోవకే వస్తాయి. మహేష్ బాబుతో తీసిన దూకుడులో కూడా ఓ వైపు సీరియస్ డిస్కర్షన్ జరుగుతుంటే.. మరో వైపు వెన్నెల కిషోర్‌తో కామెడీ చేయించి మెప్పించాడు. 2011లో ప్రపంచ వ్యాప్తంగా 1800 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ. 35 కోట్లు పెట్టి సినిమా తీస్తే..రూ. 101 కోట్లు కొల్లగొట్టి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఏడు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, ఎనిమిది సైమా, మరో ఎనిమిది సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో చుల్ బులి సమంత హీరోయిన్. వీరిద్దరి మధ్య నడిచే ఫన్నీ సీన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. థమన్ అందించిన మ్యూజిక్ చెప్పనక్కర్లేదు. ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్.

గురువారం మార్చి ఒకటి నుండి.. దూకుడు టైటిల్ సాంగ్ వరకు పిచ్చెక్కించాయి. ఇక టైటిల్ సాంగ్‌లో మహేష్ బాబుతో కలిసి ఓ గ్లామరస్ డాల్ తన అందచందాలతో మెస్మరైజ్ చేసింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. యూపీ భామ మీనాక్షి దీక్షిత్. తండ్రి ఈశ్వర్ చంద్ర దీక్షిత్ పెద్ద లాయర్. కానీ ఆమె.. బీఎస్సీ చేసింది. చిన్నప్పటి నుండే కథక్, వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకుంది. ఓ డ్యాన్స్ కాంపిటీషన్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇదే ఆమె సినీ ఎంట్రీకి కారణమైంది. తెలుగులో తెరంగేట్రం చేసిన మీనాక్షి. 2009లో లైఫ్ స్టైల్ అనే చిత్రంలో తొలిసారిగా కనిపించింది. ఓ వైపు మోడల్‌గా జోయాలుక్కాస్, మైక్రోసాఫ్ట్ విండోస్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్, చెన్నై సిల్క్స్, శంకరం డైమండ్ జువెలరీ, బ్రూక్ బాండ్ టాజా టీ, పనేరి సారీస్, లీ కూపర్, రెడ్ స్క్వేర్ ఎనర్జీ డ్రింక్ వంటి యాడ్స్‌లో మెరిసింది.

అలా రెండేళ్ల గ్యాప్ తర్వాత.. దూకుడు చిత్రంలోని ‘నీ దూకుడు… సాటెవ్వరు’ సాంగ్‌లో కనిపించింది. వెంకటేశ్ బాడీగార్డ్ చిత్రంలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. శ్రీకాంత్ దేవరాయ చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన మీనాక్షి.. బాద్ షాలో కూడా టైటిల్ ట్రాక్‌లో కనిపిస్తుంది. మహర్షిలో నిధి క్యారెక్టర్‌లో మెరిసింది ఈ బ్యూటీనే. అలా మహేష్ బాబుతో రెండు సార్లు తెరను పంచుకుంది ఈ బ్యూటీ. ఇక నాగార్జున, నాగచైతన్య మూవీ బంగ్రారాజులో దేవ కన్య అప్సర పాత్రను పోషించింది. దీని తర్వాత ఆమె తెలుగులో నటించలేదు. ఆమె కేవలం తెలుగులో మాత్రమే కాదు.. కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. గతంలో మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Meenakshi Dixit (@meenakshidixit)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss