iDreamPost
android-app
ios-app

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ లో సరికొత్త రికార్డు.. 12 ఏళ్లకే కోటి గెల్చుకున్నాడు!

  • Published Nov 29, 2023 | 1:58 PM Updated Updated Nov 29, 2023 | 1:58 PM

22 ఏళ్ల క్రితం బుల్లితెరపై వచ్చిన క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఇంకా కొనసాగుతుంది. ఈ ప్రోగ్రామ్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ హూస్ట్ గా కొనసాగుతున్నారు.

22 ఏళ్ల క్రితం బుల్లితెరపై వచ్చిన క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఇంకా కొనసాగుతుంది. ఈ ప్రోగ్రామ్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ హూస్ట్ గా కొనసాగుతున్నారు.

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ లో సరికొత్త రికార్డు.. 12 ఏళ్లకే కోటి గెల్చుకున్నాడు!

టెలివిజన్ రంగంలో చరిత్ర సృష్టించిన లైవ్ ప్రోగ్రామ్స్ లో ఒకటి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’. 2000 సంవత్సరంలో మొదలైన ప్రముఖ ఈ క్విజ్ షో 22 ఏళ్లుగా అమితాబచ్చన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అప్పటి వరకు వెండితెరపై చూసిన అమితాబ్ ఒక్కసారే బుల్లితెరపై వ్యాఖ్యాతగా రావడంతో ప్రేక్షకులు ఈ ప్రోగ్రామ్ కి బాగా అలవాటు పడ్డారు. అంతేకాదు కేబీసీ విజ్ఞానానికి సంబంధించింది కనుక చిన్నా, పెద్ద అందరూ కలిసి చూడటానికి ఇష్టపడేవాళ్లు. ఒకదశలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో వచ్చే సమయానికి అందరూ టీవీలకు అతుక్కుపోయేవారు. ఈ ప్రోగ్రామ్ అమితాబ్ కెరీర్ ని మరింత ఉన్నతంగా మలిచింది… ఇక సామన్యుల జీవితాలను సైతం మార్చింది. ప్రస్తుతం కేబీసీ సీజన్ 15 లో ‘కేబీసీ జూనియర్స్ వీక్’ నడుస్తుంది. తొలిసారిగా 12 ఏళ్ల కుర్రాడు సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు వచ్చాయి.. తొలిసారిగా 2000 సంవత్సరంలో మెదడుకి పదును పెట్టేది, విజ్ఞానానికి సంబంధించిన క్విష్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రోగ్రామ్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ హూస్ట్ గా వ్యవహరించడం మరింత ఆకర్షనీయంగా నిలిచింది. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో తొలిసారిగా కోటీ రూపాయలు గెల్చుకున్న వ్యక్తి హర్షవర్థన్ నవథే. ప్రస్తుతం ‘కేబీసీ జూనియర్స్ వీక్’ జరుగుతుంది. చివరి ఎపిసోడ్ లో హర్యానాకు చెందిన మాయంక్ హాట్ సీట్ పై కుర్చున్నాడు. 12 ఏళ్ల ఈ కుర్రాడు అమితాబ్ అడిగిన వరుస ప్రశ్నలకు ఆలోచించి మరీ సరైన సమాధానలు చెప్పాడు. అమితాబచ్చన్ ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ ప్రశ్న 2023 లో వాషింగ్టన్ డిసిలో ప్రారంభించిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఎవరి పేరు మీద ఉందీ? అన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెబితే రూ.6,40,000 గెల్చుకోవచ్చు. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ అంటూ సరైన సమాధానం చెప్పాడు. ఆ తర్వాత పలు ప్రశ్నలు సమాధానలు చెబుతూ వచ్చాడు.

సాధారణంగా ఆట సమయంలో హాట్ సీట్ పై కూర్చున్న వారిని ఎంటర్‌టైన్ చేయడం, వారి గురించి అడిగి తెలుసుకోవడం లాంటివి చేస్తుంటారు అమితాబచ్చన్. ఈ క్రమంలోనే మయాంక్ ని పెద్దయ్యాక నువు ఏం చేస్తావు అని అడిగారు అమితాబ్. తాను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని సమాధానం చెప్పాడు. అప్పుడు మయాంక్ మీరు చిన్నప్పుడు ఏం కావాలని అనుకున్నారు? అని ప్రశ్నించాడు. దానికి బిగ్ బీ నవ్వుతూ.. చిన్నప్పుడు మా గల్లీలో పిల్లలందరూ కలిసి గిల్లి దండ ఆడేవాళ్ళం.. అదే మా మదిలో మెదిలేది.. వేరే ఏ ఆలోచన రాలేదు’ అని చెప్పాడు. తర్వాత అమితాబచన్.. మయాంక్ ని కోటి రూపాయల ప్రశ్న అడిగాడు. కొత్త కండానికి అమెరికా అని పేరు పెట్టిన యురోపియన్ కార్టో గ్రాఫర్ ఎవరు? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మయాంక్ కాస్త సమయం తీసుకొని పాలిటిక్స్ పై పట్టు ఉన్న ఓ వ్యక్తి సహాయం తీసుకొని ‘మార్టిన్ వాల్డ్సీ ముల్లర్ ’ అంటూ సరైర సమాధానం చెప్పాడు. ‘కేబీసీ జూనియర్స్ వీక్’ లో తొలిసారి కోటి గెల్చుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు మయాంక్. ఆ తర్వాత మయాంక్ ని రూ.7 కోట్ల ప్రశ్న అడిగారు.. కానీ సరైన సమాధానం చెప్పలేక కోటి రూపాయలు తీసుకొని వెనుదిరిగాడు. ఈ ప్రోగ్రామ్ పై మీ భిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.