iDreamPost
android-app
ios-app

అదిరిపోయే హర్రర్ టచ్ తో కిష్కిందపురి ట్రైలర్

  • Published Sep 03, 2025 | 12:55 PM Updated Updated Sep 03, 2025 | 12:55 PM

ఇప్పుడు హర్రర్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియనిది కాదు. అందులోను తెలుగులో స్ట్రెయిట్ గా వచ్చే హర్రర్ సినిమాలు చాలా తక్కువ. సరిగ్గా ఆడియన్స్ పల్స్ ను క్యాచ్ చేసాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. బ్లాక్ బస్టర్ సినిమాలు కాకపోయినా ఒకప్పుడు మంచి బజ్ ఉన్న సినిమాలే తీస్తూ ఉండేవాడు ఈ హీరో.

ఇప్పుడు హర్రర్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియనిది కాదు. అందులోను తెలుగులో స్ట్రెయిట్ గా వచ్చే హర్రర్ సినిమాలు చాలా తక్కువ. సరిగ్గా ఆడియన్స్ పల్స్ ను క్యాచ్ చేసాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. బ్లాక్ బస్టర్ సినిమాలు కాకపోయినా ఒకప్పుడు మంచి బజ్ ఉన్న సినిమాలే తీస్తూ ఉండేవాడు ఈ హీరో.

  • Published Sep 03, 2025 | 12:55 PMUpdated Sep 03, 2025 | 12:55 PM
అదిరిపోయే హర్రర్ టచ్ తో  కిష్కిందపురి ట్రైలర్

ఇప్పుడు హర్రర్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియనిది కాదు. అందులోను తెలుగులో స్ట్రెయిట్ గా వచ్చే హర్రర్ సినిమాలు చాలా తక్కువ. సరిగ్గా ఆడియన్స్ పల్స్ ను క్యాచ్ చేసాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. బ్లాక్ బస్టర్ సినిమాలు కాకపోయినా ఒకప్పుడు మంచి బజ్ ఉన్న సినిమాలే తీస్తూ ఉండేవాడు ఈ హీరో. ఇక చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్యన భైరవం సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. అందులో శ్రీనివాస్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు సెప్టెంబర్ 12 న కిష్కిందపురి సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కు ఇప్పుడు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. దాదాపు ట్రైలర్ లో సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్పేశారు. ఓ పాడుబడిన రేడియో స్టేషన్ లో దెయ్యాలు ఉన్నాయనే పుకారు రావడంతో.. సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ తో పాటు ఓ మిత్ర బృందం ఆ రేడియో స్టేషన్ లో ఎంట్రీ ఇస్తుంది. సరదాగా స్టార్ట్ అయిన వారి జర్నీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు ఏంటి అసలు నిజంగానే అక్కడ దెయ్యం ఉందా లేదా ఇవన్నీ తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

స్టోరీ లైన్ అయితే క్లియర్ గానే ఉంది. ట్రైలర్ లోనే ఇంత క్లియర్ గా చెప్పారంటే సినిమా అంతా ఇదే ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే అసలు ట్విస్ట్ లు లోపల దాచేసారని అర్థమైపోతుంది. ట్రైలర్ లో లాస్ట్ షార్ట్ బెడ్ మీద అనుపమనే దెయ్యంగా చూపించారు. అసలు ట్విస్ట్ అదే అయినా కావొచ్చు. ఇక పిక్చర్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ కు థియేటర్స్ లో గూస్బంప్స్ పక్కా. మిరాయ్ తో ఈక్వల్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రెండు డిఫరెంట్ జోనర్స్ ఏ కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ టాక్ బావుంటే కనుక కలెక్షన్స్ విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.