iDreamPost
android-app
ios-app

ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా.. ఏడ్చా.. బంగారం చైల్ట్ ఆర్టిస్ట్ ఎమోషనల్!

  • Published Jul 22, 2024 | 8:53 PM Updated Updated Jul 22, 2024 | 8:53 PM

Sanusha.. పవన్ కళ్యాణ్, మీరా చోప్రా జంటగా నటించిన చిత్రం బంగారం. ఇందులో మీరా చోప్రా సోదరిగా నటించిన చిన్నారి గుర్తుంది కదా.. ఆమె హీరోయిన్ అయ్యింది. అయితే.. ఓ పక్క యాక్ట్ చేస్తూనే చదువుతోంది. తాజాగా ఆమె...

Sanusha.. పవన్ కళ్యాణ్, మీరా చోప్రా జంటగా నటించిన చిత్రం బంగారం. ఇందులో మీరా చోప్రా సోదరిగా నటించిన చిన్నారి గుర్తుంది కదా.. ఆమె హీరోయిన్ అయ్యింది. అయితే.. ఓ పక్క యాక్ట్ చేస్తూనే చదువుతోంది. తాజాగా ఆమె...

  • Published Jul 22, 2024 | 8:53 PMUpdated Jul 22, 2024 | 8:53 PM
ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా.. ఏడ్చా.. బంగారం చైల్ట్ ఆర్టిస్ట్ ఎమోషనల్!

ఒకప్పుడు చైల్ట్ ఆర్టిస్టులంతా హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. సజ్జా తేజ హనుమాన్ మూవీతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా మారింది. అలాగే దేవి మూవీలో బాల నటుడిగా అలరించిన పిల్లాడు తమిళంలో యాక్ట్ చేస్తున్నాడు. ఆనంద్ వర్థన్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే.. బంగారం చిత్రంతో అలరించిన సనూష సంతోష్ మాత్రం డిఫరెంట్‌ జోనర్ వైపు వెళుతుంది. ఎడ్యుకేషన్‌లో దూసుకెళుతుంది. తెలుగులో జెర్సీ చిత్రంలో నటించిన తర్వాత తాత్కాలికంగా విరామం ఇచ్చి మళ్లీ చదువుపై దృష్టి పెట్టింది. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో గ్లోబల్ మెంటల్ హెల్త్ అండ్ సొసైటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్‌ను చదివింది.

తాజాగా ఎంఎస్సీ పూర్తి చేసి.. గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరై పట్టా పొందింది. ఆ ఫోటోలను షేర్ చేసుకున్న సనూష.. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సుదీర్ఘమైన పోస్టు చేసింది. అందులో ‘నేను ఇల్లు కోల్పోయాను, ఎన్నో సార్లు ఏడ్చాను. నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ జాబ్స్ చేశా, ఆరోగ్య సమస్యలు, స్ట్రెస్, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చివరికి సాధించా. నన్ను ఆదరిస్తున్నందుకు నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. నాకు అవసరమైనప్పుడల్లా నాకు అండగా నిలిచిన నా స్నేహితులందరికీ ధన్యవాదాలు. ఈ విజయాన్ని మీ అందరికీ అంకితమిస్తున్నాను. నేను యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ నుండి MSc గ్రాడ్యుయేట్ పట్టా పొందడం సంతోషంగా, గర్వంగా ఉంది’ అంటూ ఎమోషనల్ పోస్టు చేసింది సనూష.

4 ఏళ్ల వయసులో బాలనటిగా తెరంగేట్రం చేసింది సనూష. ఆమె కేరళకు చెందిన నటి. మలయాళ చిత్రంలో బాలనటిగా రంగప్రవేశం చేసిన సనూష, ఆ తర్వాత పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించింది. రెండుసార్లు ఉత్తమ బాలనటిగా కేరళ ప్రభుత్వ అవార్డును తీసుకుంది. పవన్ కళ్యాణ్, మీరా చోప్రా హీరో హీరోయిన్లుగా వచ్చిన బంగారం మూవీలో హీరోయిన్ చెల్లెలి పాత్రల వింధ్య క్యారెక్టర్‌లో మెరిసింది. రేణి గుంటలో కూడా యాక్ట్ చేసింది. మిస్టర్ మురు మకన్ చిత్రంతో హీరోయిన్ అయిన సనూష.. తెలుగులో జీనియస్ చిత్రంలో నటించింది. తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. జెర్సీలో జర్నలిస్ట్ రమ్యగా కనిపించింది. అలాగే మార్తక్కం, లిక్కర్ ఐలాండ్ మూవీస్ చేసింది. ఈ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉంది. అటు సినిమాలు కంప్లీట్ చేసి.. పోస్టు గ్రాడ్యుయేట్ కూడా పూర్తి చేసేసింది.

 

View this post on Instagram

 

A post shared by Sanusha Santhosh💫 (@sanusha_sanuuu)

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet